డిప్యూటీ సీఎం గా పవన్ జీతం ఎంత.. ప్రభుత్వం నుంచి ఆయనకు అందే సౌకర్యాలు ఇవే?

June 12, 2024

డిప్యూటీ సీఎం గా పవన్ జీతం ఎంత.. ప్రభుత్వం నుంచి ఆయనకు అందే సౌకర్యాలు ఇవే?

ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. 2024 ఎన్నికలలో భాగంగా కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఈయనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు మంత్రి పదవి కూడా అందుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు.

ఇక పవన్ కళ్యాణ్ గెలవడంతో ఈయనకు జీతభత్యాలు ప్రభుత్వం నుంచి వచ్చే సౌకర్యాలు గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే ఒక రోజుకు రెండు కోట్ల సంపాదిస్తారు. మరి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కి వచ్చే జీతం ఎంత ఆయన ఎలాంటి సౌకర్యాలను అందుకుంటారనే విషయానికి వస్తే.. ఏ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి ఎమ్మెల్యేలకు మంత్రులకు జీతభత్యాలు చెల్లిస్తారు.

ఇక ఏపీలో ఎమ్మెల్యేలకు నెలకి 1.5 లక్షల రూపాయల జీతం చెల్లిస్తారు. అలాగే మంత్రులకు మూడు లక్షల రూపాయల వరకు జీతం చెల్లిస్తారు. ఇక వారి అవసరాలు బట్టి వారికి 1 ప్లస్, 2 ప్లస్, 3 ప్లస్ సెక్యూరిటీని కల్పించే అవకాశాలు ఉంటాయి. ఇక పవన్ కళ్యాణ్ ఒక సెలబ్రిటీ కావడంతో ఆయనకు మరింత సెక్యూరిటీ కల్పించబోతున్నారని తెలుస్తుంది. ఇక ప్రభుత్వ క్వాటర్స్ లేవు కనుక మరోసారి వేల రూపాయలు అదనంగా ఇవ్వబోతున్నారు.

ఇక ఎమ్మెల్యేలకు టెలిఫోన్ ఖర్చులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.వాహనాల కొనుగోలుకు అడ్వాన్స్ రూపంలో చెల్లిస్తుంది. ఇక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విప్, చీఫ్ విప్, ప్రధాన ప్రతిపక్ష నేత లకు ఎమ్మెల్యేల కంటే ఎక్కువ జీతభత్యాలు ఉంటాయి.ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా లక్షల్లో జీతం అందుకుంటే.. హీరోగా వందల కోట్లు సంపాదిస్తారనీ చెప్పాలి.

Read More: భారీగా రెమ్యూనరేషన్ పెంచిన బాలయ్య.. అఖండ 2 రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు