April 3, 2024
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎంతో బిజీగా మారిపోయారు. ఈయన సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే ఎన్నో సినిమాలకు కమిట్ అయ్యారు అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఈయన సినిమాలకు విరామం ఇచ్చి రాజకీయ పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన పిఠాపురం నుంచి ఎన్నికలలో పోటీ చేయబోతున్న తరుణంలో ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
ఇక ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నటువంటి తరుణంలో ఈయన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి ఇటీవల ఒక బ్లేజ్ వీడియో విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ వీడియోలో భాగంగా పవన్ కళ్యాణ్ గ్లాస్ గురించి కొన్ని డైలాగ్స్ చెప్పారు. ఈ డైలాగ్స్ చాలా హైలెట్ అయ్యాయని చెప్పాలి. పగిలే కొద్ది గ్లాసుకు పదున ఎక్కువ.. గ్లాస్ అంటే సైజు కాదు కనిపించని సైన్యం అంటూ చెప్పినటువంటి డైలాగ్స్ ఈయన ప్రచార కార్యక్రమాలకు కూడా బాగా సెట్ అయ్యాయని చెప్పాలి.
డైలాగ్ గురించి పవన్ కళ్యాణ్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నాకు సినిమాలలో ఇలాంటి డైలాగ్స్ వాడటం ఇష్టం లేదు కానీ ఎందుకు పెట్టావ్ అని హరీష్ శంకర్ ని అడిగాను.ఆ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ మీకేం తెలుసు మా బాధలు మీ సినిమాలలో ఇలాంటి డైలాగ్స్ రాకపోతే మీ ఫ్యాన్స్ అసలు ఊరుకోరు అంటూ సమాధానం చెప్పారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన ఈ వీడియో పై హరీష్ శంకర్ స్పందిస్తూ మీ ప్రేమకు ధన్యవాదాలు సర్కార్ మీరు అంగీకరించాలి కానీ ఇలాంటివి ఇంకా రాస్తా అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read More: ఖరీదైన కారును కొనుగోలు చేసిన ఎన్టీఆర్.. కారు ధర ఎంత అంటే?