వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కళ్యాణ్..అదే కారణమా?

June 26, 2024

వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కళ్యాణ్..అదే కారణమా?

సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరికొత్త అవతారంలో కనిపించారు. ఈయన ఇప్పటివరకు పొలిటికల్ పరంగా ఎక్కడ చూసినా మనకు వైట్ అండ్ వైట్ లో కనిపించే పవన్ కళ్యాణ్ ఈసారి అమ్మవారి దీక్షలో కనిపించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్ష వేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ కు భక్తి ఎక్కువ అనే సంగతి మనకు తెలిసిందే. ఈయన ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెట్టాలంటే కచ్చితంగా కొండగట్టు అంజన్న క్షేత్రానికి వెళ్లి అక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారు అంతేకాకుండా ఈయన వాస్తు పరంగా కూడా కొన్ని విషయాలను నమ్ముతారని ఆయన చేతికి ఉన్న ఉంగరాలను చూస్తేనే అర్థమవుతుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ వాహనానికి కూడా ఏకంగా వారాహి పేరును పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా దైవభక్తి ఎంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏకంగా వారాహి అమ్మవారి దీక్ష వేసుకొని మరోసారి భక్తి భావాన్ని చాటుకున్నారు ఈయన 11 రోజులపాటు ఈ దీక్షలో ఉండబోతున్నారని తెలిసిందే .ఈ దీక్ష వేయడంతో ఈ 11 రోజులు ఎలాంటి ఆహార పదార్థాలు తినకుండా కేవలం పండ్లు ఇతర ద్రవపదార్థాలను మాత్రమే తీసుకోబోతున్నారని తెలుస్తుంది.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష వేయడంతో వారాహి అమ్మ వారి గురించి కూడా ఎంతోమంది తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా రావాలని అమ్మవారిని మొక్కుకున్నారని అయితే ఈయన ఎన్నికలలో మంచి విజయం అందుకోవడంతోనే 11 రోజులపాటు ఈ దీక్ష వేశారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయాలపై ఫోకస్ చేస్తూ ప్రజా సమస్యలను నెరవేర్చే పనులలో బిజీగా ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు