ఆ ఒక్క కారణంతోనే నేను యాడ్స్ చేయడానికి దూరంగా ఉంటాను.. పవన్ కామెంట్స్ వైరల్!

June 24, 2024

ఆ ఒక్క కారణంతోనే నేను యాడ్స్ చేయడానికి దూరంగా ఉంటాను.. పవన్ కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలందరూ కూడా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఎన్నో బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ కమర్షియల్ యాడ్స్ చేస్తూ ఉంటారు. ఇలా సినిమాల పరంగా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న సెలబ్రిటీలందరూ కూడా మరోవైపు వరుసగా ఇలాంటి యాడ్స్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇక తెలుగులో కూడా ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ మహేష్ బాబు వంటి వారు వరుస యాడ్స్ చేస్తూ భారీగానే డబ్బు సంపాదిస్తున్నారు.

ఇకపోతే ఇండస్ట్రీలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకొని మంచి క్రేజ్ ఉన్న వారిలో నటుడు పవన్ కళ్యాణ్ కూడా ఒకరు ఇప్పుడు ఈయన సినిమాలలో మాత్రమే కాదు రాజకీయాలలో కూడా సక్సెస్ అందుకోవడంతో ఈయన పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోతుంది. ఇలా తనకున్న ఇమేజ్ క్యాష్ చేసుకొని ఈయన ఎన్నో బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ డబ్బు సంపాదించవచ్చు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలా చేయలేదు.

ఈయన గత 20 సంవత్సరాలకు గత ఒక కోలా కంపెనీకి ప్రమోట్ చేస్తూ ఆడ్ చేశారు అయితే దానివల్ల నెగిటివ్స్ ఉన్నాయని తెలిసి ఈయన వదిలేశారు కానీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోల రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ ఇస్తామని ఆఫర్ చేసిన తాను మాత్రం అంగీకరించలేదని పవన్ తెలిపారు. తాను యాడ్స్ చేస్తానంటే ఎన్నో కంపెనీలు నాకు ఆఫరిస్తాయి కానీ నేను డబ్బు కోసం ఆశపడలేదని తెలిపారు.

పపన్ కళ్యాణ్ అనేవాడు గొంతు విప్పితే అది ప్రజలకి మేలు జరగాలి. ప్రజల కష్టాలకు భుజం కాయాలి. ఈ రోజు పాలిటిక్స్ లోకి వచ్చి నేను ఈ మాటలు అనటం లేదు. ఇది నా సోషలిస్ట్ లక్షణం ఇది. సోషలిస్ట్ భావాలు తాలూకు ప్రతిరూపం ఇదంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More: నాకు బద్ధకం చాలా ఎక్కువ.. తన వీక్నెస్ బయటపెట్టిన ప్రభాస్!

ట్రెండింగ్ వార్తలు