చరణ్ వద్ద పవన్ అప్పు చేశారా.. వడ్డీలు కూడా కడతానని చెప్పారా?

June 20, 2024

చరణ్ వద్ద పవన్ అప్పు చేశారా.. వడ్డీలు కూడా కడతానని చెప్పారా?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినీ నటుడుగా మాత్రమే కాకుండా ఈయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా అలాగే మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలో పరంగా మాత్రమే కాకుండా రాజకీయాల పరంగా కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. రాజకీయ నాయకుడిగా ఎంతో ఉన్నత హోదాలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ఒకానొక సమయంలో రాంచరణ్ వద్ద డబ్బులు అప్పుగా తీసుకున్నారు అని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ భారీగా సంపాదించారు. ఈయన తన సొంత డబ్బులు ఖర్చు చేసుకొని పేద ప్రజలకు సహాయం చేశారు అలాంటి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వద్ద అప్పు చేయడం ఏంటి పైగా వడ్డీలు కూడా కడతానని చెప్పడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు అసలు రామ్ చరణ్ వద్ద ఎంత మొత్తంలో డబ్బు తీసుకున్నారు అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే..

పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఇంటిపట్టునే ఉండే వారట అయితే ఆ సమయంలో తనకు తన పేరెంట్స్ తన అన్న ఇచ్చిన పాకెట్ మనీ అయిపోయేది అలాంటి సమయంలో డబ్బులు తన వద్ద లేకపోవడంతో చిరు తన కొడుకు రామ్ చరణ్ కు ఇచ్చిన పాకెట్ మనీని పవన్ కళ్యాణ్ తీసుకునే వారట. చరణ్ చిన్న పిల్లవాడు కావడంతో తనకు వడ్డీ వేసి మరింత డబ్బు ఎక్కువగా ఇస్తానని మాయమాటలు చెప్పే పవన్ కళ్యాణ్ చరణ్ వద్ద డబ్బులు తీసుకునే వారని ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు ఓ సందర్భంలో తెలియచేశారు అయితే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు రావడంతో పవన్ కళ్యాణ్ పాకెట్ మనీ కోసం డబ్బులు అడిగి తీసుకునే స్టేజ్ నుంచి ఈ స్థాయికి ఎదిగారని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More: ఆ సినిమాలో నటించి తప్పు చేశాను.. నయనతార కామెంట్స్ వైరల్!

ట్రెండింగ్ వార్తలు