June 24, 2024
ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడంతో చిత్రపరిశ్రమ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సెలెబ్రెటీలు ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ఇది తమ సక్సెస్ అనేలా భావిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ అద్భుతమైన మెజారిటీతో గెలవడంతో సోషల్ మీడియా వేదికగా సినిమా సెలబ్రిటీలందరూ కూడా పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి కావడంతో సినీ పరిశ్రమకు ఏ విధమైనటువంటి లోటు ఉండదని అందరూ భావిస్తున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ అఖండమైన విజయం అందుకోవడంతో టాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఈయన సక్సెస్ ను సెలెబ్రేట్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. ఈయన 100 సినిమాలను నిర్మించాలన్నదే తన లక్ష్యం అంటూ ప్రస్తుతం వరుస సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా కూడా ఈయనే నిర్మించారు. ఇలా పవన్ తో తనకు చాలా మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో పవన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే జూన్ 23వ తేదీ రాత్రి హైదరాబాద్లోని ఓ పెద్ద కన్వెన్షన్ లో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు హాజరై సందడి చేశారు. ఇకపోతే పెద్ద ఎత్తున అభిమానులు కూడా తరలి రావడంతో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకోవడమే కాకుండా వచ్చిన అభిమానులందరికీ కూడా భోజనం పెట్టి పంపించారు. ఇలా ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Read More: నన్ను ట్రోల్ చేయొద్దు… ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్!