ఇది కదా పవర్ స్టార్ అంటే.. భారీ మెజార్టీతో విజయం సాధించిన జనసేన పవన్ కళ్యాణ్!

June 4, 2024

ఇది కదా పవర్ స్టార్ అంటే.. భారీ మెజార్టీతో విజయం సాధించిన జనసేన పవన్ కళ్యాణ్!

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు అన్న మాటలను నిలబెట్టుకున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అనే నినాదాలతో రాష్ట్రమంతా ప్రభావం చూపించారు. అయితే గతంలో రెండు సార్లు ఎలక్షన్లలో పోటీ చేసి దారుణంగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. ఇక త్వరలోనే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్.

ఏపీలో కూటమి భారీ స్థాయిలో విజయం సొంతం చేసుకోగా జనసేన నిలబడ్డ 21 సీట్లలో 20 సీట్లు గెలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ భార మెజారిటీతో గెలుపును సొంతం చేసుకున్నారు. కౌంటింగ్ ముగిసే సరికి పవర్ స్టార్ 70 వేలకు పైగా మెజారిటీతో దూసుకుపోతున్నారు. దాంతో ఇక్కడ పవన్ గెలుపు ఖాయం అయిపోయింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక రాష్ట్రం అంతా కూటమి క్లీన్ స్వీప్ చేసేసింది.

గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ ఈసారి 15 సీట్లకే పరిమితం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ విజయంతో పాటు దాదాపు 20సీట్లు సాధిస్తోన్న జనసేనకు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. అంతే కాదు మెగా ప్యామిలీతో పాటు ఇండస్ట్రీలో నుంచి కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read More: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ఉర్ఫీ జావెద్.. ముఖమంతా వాచిపోయి అలా?

ట్రెండింగ్ వార్తలు