September 6, 2021
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ప్రామిసింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఓ భారీ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే..గతేడాది పవన్ బర్త్ డే నాడు ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చారు. అయితే కరోనా కారణంగా షూటింగ్స్ వాయిదా పడడంతో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఉన్న కమిట్స్‌మెంట్ పూర్తి కాలేదు. దాంతో ఏడాది పవన్ బర్త్‌డేకి కేవలం ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. తాజాగా ఈ సినిమాకు సంభందించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్..PSPK28 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు.
ప్రస్తుతం పవన్- రానా మూవీ `భీమ్లా నాయక్’ చివరి దశలో ఉంది.. ‘హరి హర వీరమల్లు’ చిత్ర షూటింగ్ తిరిగి సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ క్రమంలో పవన్ – హరీష్ సినిమాకు సంబంధించి చర్చలు కూడా జరిగినట్లుగా ఓ ఫోటోని చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో పవన్ కల్యాణ్ – హరీష్ శంకర్ లతో పాటుగా నిర్మాతలు నవీన్ ఎర్నేని – వై. రవిశంకర్ కనిపిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ – హరీశ్ కాంబోలో రానున్న #PSPK28 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని మేకర్స్ ప్రకటించడంతో పవన్‌ఫ్యాన్స్ ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. తాజా సమాచారం ప్రకారం దసరాకి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.