February 4, 2022
PawanKalyan-SaiDharamTej: పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటినుండో వినిపిస్తుంది. అయితే ఇప్పుడు హాట్‌టాపిక్ ఏంటంటే ఈ సినిమాకు తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించనున్నాడట.
పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా ఇప్పటికే చాలా సినిమాలు నిర్మించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. గతంలో చెప్పిన వివరాల ప్రకారం పదికి పైగా చిత్రాలను వీరు లైనప్ చేసినట్టు తెలుస్తోంది. అందులో పవన్-సాయితేజ్ సినిమా కూడా ఉందట.
అయితే కరోనా కారణంగా పవన్ సినిమాలు కూడా ఆలస్యమవుతూ వస్తున్నాయి. ఇప్పటికే భీమ్లా నాయక్ పూర్తి చేసిన పవన్ రేపో ఎల్లుండో హరిహర వీరమల్లు షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఆ తర్వాత ‘గబ్బర్‌సింగ్’ డైరెక్టర్ హరీష్‌శంకర్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌తాళ్లూరి నిర్మాతగా ఓ సినిమా కమిటైయ్యారు పవన్‌కల్యాణ్. మరి.. ఈ సినిమాలను పూర్తి చేసిన తర్వాతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి చెందిన సినిమాను టేకప్ చేస్తారా? లేక మధ్యలోనే PawanKalyan-SaiDharamTej సినిమాను సెట్స్‌పైకి తీసుకుని వెళ్తారా? అనే విషయంపై ఓ స్పష్టత రావాల్సి ఉంది.
Read More: NTR 30: ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో ఆలియా భట్ కన్పర్మ్ ఇదిగో ప్రూఫ్