త్వరలో ఆన్‌లైన్ టికెటింగ్‌ వెబ్‌సైట్ ప్రారంభిస్తాం – మంత్రి పేర్ని నాని..

January 10, 2022

త్వరలో ఆన్‌లైన్ టికెటింగ్‌  వెబ్‌సైట్ ప్రారంభిస్తాం – మంత్రి పేర్ని నాని..

సినిమా టికెట్ల రేట్ల‌పై పూర్తిగా ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. సినిమా థియేటర్లల్లో ఆన్‌లైన్ టిక్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఆన్ లైన్ టిక్కెటింగ్ కోసం అవసరమైన వెబ్ సైట్ రూపకల్పనపై అధికారులతో సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని సమావేశం అయ్యారు. వీలైనంత త్వరలో ఏపీలోని సినీ థియేటర్లల్లో ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికే టిక్కెట్ రేట్లను నియంత్రిస్తూ చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. తాజాగా ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థ పైనా ఫోకస్ పెట్టింది.

Read More: Jacqueline Fernandez: ఆ ఫోటోల‌ను ప్ర‌సారం చేయొద్దు మీడియాకు జాక్వెలిన్ రిక్వెస్ట్‌

ట్రెండింగ్ వార్తలు