ఆగిపోయిన సినిమాను తిరిగి స్టార్ట్‌ చేసిన నాగశౌర్య

July 3, 2022

ఆగిపోయిన సినిమాను తిరిగి స్టార్ట్‌ చేసిన నాగశౌర్య

‘ఊహలుగుసగుసలాడే’, ‘జ్యో అచ్చుతానంద’ సినిమాల తర్వాత హీరో నాగశౌర్య, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ‘ఫలానా అబ్బాయి…ఫలానా అమ్మాయి’. నాగశౌర్య, మాళవిక నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మ నిర్మిస్తున్నారు.

కరోనా కంటే ముందే ఈ సినిమా షూటింగ్‌ వివిధ కారాణాల వల్ల నిలిచిపోయింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి స్టార్ట్‌ చేశారు అవసరాల శ్రీనివాస్, నాగశౌర్య. ఈ సినిమా లేటెస్ట్‌ షెడ్యూల్‌ లండన్‌లో ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వీలైనంత తొందరగా షూటింగ్‌ను పూర్తి చేసి ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్‌. ఈ సినిమాకు వివేక్‌ కూచిభొట్ల ఈ సినిమాకు సహ నిర్మాత. అలాగే ‘కల్యాణవైభోగమే..’ వంటి డీసెంట్‌ ఫిల్మ్‌ తర్వాత నాగశౌర్య, మాళవిక నాయర్‌లు కలిస్తున్న చేస్తున్న సినిమా కూడా ఇదే అవుతుంది

ట్రెండింగ్ వార్తలు