September 7, 2022
పదో శతాబ్ధంలో చోళ రాజ్యంలోని స్వర్ణయుగాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వెండితెరపై ఆవిష్కరించ బోతున్నారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. ఇక రెండు భాగాలుగా తెరకెక్కితున్న ‘పొన్నియన్ సెల్వన్’. తొలి భాగం సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. కాగా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ వారి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రిలీజ్ అయిన రెండు పాటలు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది.
‘వెయ్యి సంవత్సరాల క్రితం.. చోళ నాట స్వర్ణశకం ఉదయించక మునుపు, ఒక తోక చుక్క ఆకాశంలో ఆవిర్భవించింది.. చోళ రాజ కులంలో ఒకరిని ఆ తోకచుక్క బలిగోరుతుందంటున్నారు జ్యోతిష్యులు.. దేశాన్ని పగలు, ప్రతికారాలు చుట్టుముట్టాయి. సముద్రాలు ఉప్పొంగుతున్నాయి..వంచన ద్రోహం రాజమందిరంలోకి చొచ్చుకొనిపోతున్నాయి..`అంటూ రానా వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ట్రైలర్ చూపించిన యుద్ధపు సన్నివేశాలు. పోరాటలు సినిమా అంచనాలను పెంచేస్తోంది. కాగా కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక మంగళవారం జరిగిన ఈ ట్రైలర్ ఈవెంట్లో ‘లోకనాయకుడు’ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథులు హజరయ్యారు.