May 14, 2024
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి పూజా హెగ్డే ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవల కాలంలో పూజా హెగ్డే నటించిన ఏ సినిమాలో కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయని చెప్పాలి.
ప్రస్తుతం ఈమెకు సినిమా అవకాశాలు రావడమే గగనంగా మారింది. ఇలా సినిమా అవకాశాల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈమెకు ఏకంగా బాలీవుడ్ అవకాశం వచ్చిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి పూజా హెగ్డే ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు.
ఇకపోతే తాజాగా పూజ హెగ్డేకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే పూజా హెగ్డే తల్లి కాబోతుంది అంటూ ఒక వార్త సంచలనంగా మారింది. ఈమె పెళ్లి చేసుకోకుండానే తల్లి కావడం ఏంటి అంటూ ఈ వార్త తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అయితే ఈమె తల్లి కాబోతున్నది నిజజీవితంలో కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కమిట్ అయిన సినిమాలో ఈమె ఓ తల్లి పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది.
స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె అవకాశాలు లేకపోతే ఇలా తల్లి పాత్రలకు ఒప్పుకుంటుందా అంటూ అభిమానులు కూడా షాక్ అవుతున్నారు అయితే తల్లి పాత్ర అంటే హీరోయిన్ కి తల్లి పాత్ర కాకుండా హీరోయిన్ చిన్నప్పటి పాత్రకు తల్లి పాత్రలో నటించబోతున్నారని సమాచారం. ఇలా పూజా హెగ్డే సినిమాలలో తల్లి పాత్రలో నటించబోతున్నారని విషయం తెలిసి తన తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read More: త్రిష ‘ఐడెంటిటీ’ పూర్తి!