అలాంటి వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ పూనమ్ కౌర్.. ప్రస్తుత పరిస్థితి ఇదే?

February 2, 2024

అలాంటి వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ పూనమ్ కౌర్.. ప్రస్తుత పరిస్థితి ఇదే?

ఇటీవల కాలంలో సెలబ్రెటీలు ఒకరి తరువాత ఒకరు వరుసగా అరుదైన వ్యాధి బారిన పడుతున్నారు. అంతేకాకుండా ఇదివరకటిలా కాకుండా వారికి వచ్చిన సమస్యలను అభిమానులతో పంచుకోవడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. అలా ఇప్పటికే చాలామంది హీరోయిన్లు వారికి వచ్చిన సమస్యల గురించి బయట పెట్టిన విషయం తెలిసిందే. మొన్నటికిమొన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన హెల్త్ కండిషన్ ను బయటపెట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతకంటే ముందు శృతిహాసన్, తన ఆరోగ్య సమస్యను బయటపెట్టింది.

ఇలా చాలామంది హీరోయిన్లు వారు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల్ని బయటపెట్టారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ లిస్టులోకి మరొక టాలీవుడ్ హీరోయిన్ చేరింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఆమె ఎలాంటి సమస్యతో బాధపడుతోంది అన్న విషయాన్ని వస్తే.. తాజాగా ఈ లిస్ట్ లోకి నటి పూనమ్ కౌర్ కూడా చేరింది. గతంలో తను తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడిన విషయాన్ని బయటపెట్టింది పూనమ్. కాగా పూనమ్ కౌర్ గతంలో ఫైబ్రోమయాల్జియా అనే సమస్యతో బాధపడిందంట. ఇది కూడా ఒక రకమైన మయోసైటిస్ లాంటిదే అని చెప్పవచ్చు. ఫైబ్రోమయాల్జియా బాధితులు తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారు.

శరీరం నిస్సత్తువుగా మారుతుంది. అలసటతో పాటు నిద్రలేమితో బాధపడతారు. ఈ సమస్యతో తను చాన్నాళ్లు బాధపడినట్టు వెల్లడించింది పూనమ్ కౌర్. చేతులు, కాళ్లు పట్టేసేవని, టైట్ గా ఉండే దుస్తులు ధరించలేక, దాదాపు రెండేళ్ల పాటు వదులుగా ఉండే దుస్తులు మాత్రమే ధరించాల్సి వచ్చిందని వెల్లడించింది. అలా చాలా రోజులు బాధపడిన తర్వాత నేచురోపతిలో పేరుగాంచిన మంతెన సత్యనారాయణను కలిశానని, ఆయన ఇచ్చిన సలహాలు తనకు బాగా ఉపయోగపడ్డాయని చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్. ప్రస్తుతం తన హెల్త్ కండిషన్ బాగానే ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.

Read More: డైరెక్టర్ ని ఒరేయ్ గుండు నాయాలా అని పిలిచిన నెటిజన్.. అయిన రియాక్షన్ ఇదే?

ట్రెండింగ్ వార్తలు