Trivikram-PoonamKaur: మ‌రోసారి త్రివిక్ర‌మ్‌పై సెటైర్లు వేసిన పూనంకౌర్‌..ఈ సారి డైరెక్ట్‌గానే..

July 10, 2024

Trivikram-PoonamKaur: మ‌రోసారి త్రివిక్ర‌మ్‌పై సెటైర్లు వేసిన పూనంకౌర్‌..ఈ సారి డైరెక్ట్‌గానే..

ఇటీవల యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వివాదంలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన తండ్రి కూతుర్ల రిలేషన్ గురించి కూడా తప్పుగా వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోస్ సంచలనగా మారాయి. ఇక ఈ వీడియోపై మొదటిగా సాయిదుర్గా తేజ్ స్పందించారు.

ప్రణీత్ హనుమంత్ ఒక‌ ఆడపిల్ల గురించి ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి వీడియోపై హీరో సాయిదుర్గా తేజ్ స్పందిస్తూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచించడమే కాకుండా ఇలాంటి వెధవలకు తప్పనిసరిగా శిక్ష పడాలని ట్వీట్ చేయడంతో ఏకంగా గవర్నమెంట్ సైతం స్పందిస్తూ అలాంటి వారిపై క‌ఠిన చర్యలకు సిద్ధమయింది.

Read MoreSamantha: సావిత్రిలా నా జీవితం కాకూడదు..అందుకే దూరమయ్యాను

ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ చేస్తున్న ఈ సాహసంపై ఎంతోమంది రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే నటి పూనం కౌర్ సైతం సాయి ధరంతేజ్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఇక ఇదిలా ఉంటే కొంతమంది నెటిజన్లు మాత్రం సాయి ధరమ్ తేజ్ చేసిన పనిని గుర్తిస్తూనే ‘జల్సా’ సినిమాలో పవన్ కళ్యాణ్ పడుకునే వాళ్ళను రేపు చేస్తే ఏమోస్తుంది..ప‌రిగెత్తేవాళ్ల‌ని చేయాలి క‌దా అంటూ బ్రహ్మానందంతో చెప్పే ఒక డైలాగ్ ని షేర్ చేశారు.

ఇక ఈ కామెంట్లపై కూడా ఈమె స్పందిస్తూ..ఈ సినిమాలో డైలాగ్ చెప్పినది పవన్ కళ్యాణ్ అయినప్పటికీ రాసింది మాత్రం త్రివిక్రమ్. ఆయన అంతకంటే గొప్పగా ఏం రాయగలడు అంటూ త్రివిక్రమ్ పైన పంచులు వేసింది. ఇక త్రివిక్రమ్ పూనమ్ మధ్య ఎప్పుడు వివాదం జరుగుతూనే ఉంటుంది. ఇదివరకు ఈమె త్రివిక్రమ్ ని పట్టుకొని గురూజీ అంటూనే సెటైర్లు వేసేది కానీ ఇప్పుడు మాత్రమే ఏకంగా ఆయన పేరును ప్రస్తావిస్తూ తనపై పంచులు వేస్తున్నారు. మరి వీరిద్దరి మధ్య ఏ విధమైనటువంటి విభేదాలు ఉన్నాయో తెలియదు కానీ ఈమె మాత్రం త్రివిక్రమ్ పై విమర్శలు చేస్తూనే ఉంటుంది.

Related News

ట్రెండింగ్ వార్తలు