40 ఏళ్ల క్రితమే కల్కి సినిమా రావాల్సింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ పెద్దమ్మ!

July 1, 2024

40 ఏళ్ల క్రితమే కల్కి సినిమా రావాల్సింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ పెద్దమ్మ!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకొని అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఈ సినిమా విడుదలై మూడు రోజులైనా ఇప్పటికే సుమారు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇలా ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసింది..

ఇక బాహుబలి సినిమా తర్వాత అదే స్థాయిలో ప్రభాస్ సక్సెస్ అందుకోవడంతో ప్రభాస్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటించారు. అంతే కాకుండా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి నటన కూడా ఎంతో హైలెట్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

కల్కి సినిమా ఇప్పుడు కాదు 40 సంవత్సరాల క్రితమే రావాల్సి ఉండేదని ఈమె తెలిపారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గారు కల్కి పేరిట ఒక సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాలో ఒక పాట రికార్డింగ్ కూడా అయిందని ఆ పాట కీరవాణి చేశారని ఇప్పటికి ఆయన పూజ మందిరంలో ఆ పాట ఉంటుందని తెలిపారు.

ఇలా 40 సంవత్సరాల క్రితం రావాల్సిన కల్కి సినిమా కొన్ని కారణాలవల్ల ఆగిపోయిందని అలా అప్పుడు కృష్ణంరాజు చేయాల్సిన ఈ కథ ఆగిపోవడం, ఇప్పుడు అదే సినిమా పేరిట ప్రభాస్ చేయడం చాలా యాదృచ్ఛికంగా ఉందని శ్యామలాదేవి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా 40 సంవత్సరాల క్రితం కృష్ణంరాజు చేయలేని ఈ సినిమాని ఇప్పుడు ప్రభాస్ చేశారని తెలిసి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ పై అంచనాలు కూడా పెరిగాయి

ట్రెండింగ్ వార్తలు