April 13, 2024
వివాదాస్పద జ్యోతిష్యులు వేణు స్వామి ఇటీవల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల జాతకాలను అలాగే రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ వార్తలలో నిలుస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ జాతకం గురించి ఏదో ఒక విషయం చెబుతూ వార్తలలో నిలిచి వేణు స్వామి ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు.
ఇలా ప్రభాస్ అభిమానులు తనని ట్రోల్ చేసినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా ప్రభాస్ జాతకం గురించి ఈయన చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారుతూ ఉంటాయి. ఇకపోతే ఇటీవల వేణు స్వామి తన భార్య వీణా వాణితో కలసి మిర్చి సినిమాలోని ఓ సన్నివేశాన్ని స్పూఫ్ గా చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ వీడియో పై తాజాగా వేణు స్వామి ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ వీడియో చూసి ప్రభాస్ తన అభిప్రాయాన్ని తెలియజేశారని తెలిపారు.స్పూఫ్ వీడియో గురించి ప్రభాస్ స్పందిస్తూ నేను చాలా స్టైల్ గా ఉన్నానని అన్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్ అంటే నాకు ఎలాంటి ద్వేషం లేదని నేను అతనిని ఎలాంటి టార్గెట్ చేయలేదని తెలియజేశారు. ఇక మా తోటలో పండే పండ్లు ప్రభాస్ ఇంటికి పంపిస్తూ ఉంటామని వేణు స్వామి తెలిపారు.
ఒకసారి మా తోటలో పండిన సీతాఫలం మాకు తెలిసిన వారికి పంపించాము వారి నుంచి ప్రభాస్ వద్దకు వెళ్లగా ఆ పండ్లు తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పగా ఇలా మేము పంపించామని చెప్పడంతో మరొకసారి పంపించమని అడిగిమరీ తీసుకున్నారని తెలిపారు.
ఇలా అప్పటినుంచి మా తోటలో పండే పండ్లు ప్రభాస్ ఇంటికి చేరుతాయని ఈ సందర్భంగా వేణు స్వామి చెప్పడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇద్దరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉండగా మరి ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి అలా చెప్పడం ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.