ప్రభాస్ కి ఓటు హక్కు లేదా.. ఓటు వేయకపోవడానికి అదే కారణమా?

May 14, 2024

ప్రభాస్ కి ఓటు హక్కు లేదా.. ఓటు వేయకపోవడానికి అదే కారణమా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు అయితే సినిమా సెలబ్రిటీలందరూ కూడా ఎలాంటి పనులలో ఉన్నా ,ఎక్కడ ఉన్నా కూడా ఎన్నికల నేపథ్యంలో వారి పనులు అన్నిటిని పక్కన పెట్టి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ క్రమంలోనే మే 13వ తేదీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు ఇక సెలబ్రిటీలు కూడా సామాన్య వ్యక్తుల మాదిరిగా క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా మే 13వ తేదీ జరిగినటువంటి ఎన్నికలలో భాగంగా మహేష్ బాబు ఎన్టీఆర్ అల్లు అర్జున్ చిరంజీవి వంటి వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇలా సినీ తారలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నప్పటికీ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మాత్రం అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలో ఎక్కడ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోలేదు .దీంతో ప్రభాస్ పై భారీ స్థాయిలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఇప్పటివరకు ప్రభాస్ కు ఓటు హక్కు లేదా అంటూ పలువురు ట్రోల్స్ చేయగా మరికొందరు ఓటు ఉన్నప్పటికీ ఈయన తన ఓటు హక్కునువినియోగించుకోవడానికి ఇష్టపడటం లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే మరికొందరు హీరో రాజశేఖర్ ఓటు వేయడానికి రావడంతో ప్రభాస్ ఓటు వేయడానికి వచ్చారు అంటూ ఆయన ఫోటోలను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు ప్రభాస్ తలకు ఏ విధంగా అయితే క్లాత్ తో క్యాప్ కట్టుకుంటారో ,అలాగే రాజశేఖర్ కూడా క్యాప్ వేసుకోవడంతో ఈయన ఫోటోని షేర్ చేస్తూ ప్రభాస్ ఓటు వేయడానికి వచ్చారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి ప్రభాస్ ఓటు హక్కును వినియోగించకపోవడానికి కారణం తెలియదు కానీ ఈయనని మాత్రం భారీగా ట్రోల్ చేస్తున్నారు.

Read More: టాక్సిక్ లో నటించబోతున్న బాలీవుడ్ భామ.. 8 ఏళ్లలో చేసింది రెండు సినిమాలే!

ట్రెండింగ్ వార్తలు