January 5, 2022
Prabhas: ప్రభాస్‌కు వ్యక్తిగత పీఆర్‌గా దివంగత పీఆర్వో బీఏరాజుగారు ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు ఏ ఇబ్బంది ఉండేది కాదు. కానీ దురదృష్టవశాత్తు బీఏరాజు మరణించడంతో ప్రభాస్ పీఆర్‌ను ఏలూరు శీను చూస్తున్నారు. అయితే అల్లు కాంపౌండ్‌లో ఏలూరు శీను ఎప్పట్నుంచో ఉన్నారు. అయితే రాధేశ్యామ్ సినిమా విడుదల విషయంలో శీను చేసిన వ్యవహారం ప్రభాస్ ఫ్యాన్స్‌కు మింగుడు పడటం లేదు. రాధేశ్యామ్ సినిమా వాయిదా పడిందని ట్వీట్స్ పెట్టాల్సింది పోయి…అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు సంక్రాంతి వరకు తిరుగేలేదని (సంక్రాంతికి ఇంకా ఏ పెద్ద సినిమా రాలేదు కాబట్టి) ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఏలూరు శీను ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడంతో ఆలస్యంగా విషయాన్ని గమనించిన ఏలూరు శీను తప్పుదిద్దు కోవాలనే, లేకపోతే ఏదో ఒకటి చేయకపోతే ఓ పెద్ద స్టార్‌కు పీఆర్ పోతుందనే భయంతోనే, డార్లింగ్ ఫ్యాన్స్‌ను చల్లబరచాలనో కానీ…‘రెబల్‌స్టార్ ప్రభాస్‌గారు అంటే నాకు ప్రాణం. నా ట్వీట్ వల్ల బాధపడినందుకు క్షమించండి’ అంటూ ట్వీట్ వేశాడు. హీరోల మీద అభిమానం ఉండొచ్చు…కానీ వారి అభిమానులనుగౌరించాల్సిన బాధ్యతను మర్చిపోకూడదు.