జీవితంలోకి స్పెషల్ పర్సన్ రాబోతోంది.. ప్రభాస్ పోస్ట్ పెళ్లి గురించేనా?

May 17, 2024

జీవితంలోకి స్పెషల్ పర్సన్ రాబోతోంది.. ప్రభాస్ పోస్ట్ పెళ్లి గురించేనా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ సినిమా పనులలో బిజీగా ఉండగా త్వరలోనే కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం జూన్ 27వ తేదీ విడుదల కానుంది.

ఇలా ఈ సినిమాతో పాటు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రభాస్ సినిమాలపై ఆసక్తి నెలకొంది. ఇక ఈయన సినిమాల విషయం పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్నారు. ఇప్పటివరకు ప్రభాస్ పెళ్లి కూడా చేసుకోలేదు దీంతో ఈయన పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

ఇలా పెళ్లి గురించి ఎన్నోసార్లు ప్రభాస్ ని ప్రశ్నించిన ఇదిగో అదిగో అంటున్నారే తప్ప ఎప్పుడు పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన సందర్భాలు లేవు. అయితే తాజాగా ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సంచలనగా మారింది. ఈ పోస్ట్ చూస్తుంటే త్వరలోనే ప్రభాస్ పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.

ఈ సందర్భంగా ప్రభాస్ స్పందిస్తూ డార్లింగ్స్.. త్వరలోనే ఒక స్పెషల్ పర్సన్ తమ జీవితంలోకి రాబోతోంది. వెయిట్ చేయండి అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ ఈ పోస్ట్ తప్పనిసరిగా తన పెళ్లిని ఉద్దేశించి చేశారని త్వరలోనే పెళ్లికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన పెళ్లి కనుక చేసుకుంటే ఎవరిని చేసుకోబోతున్నారు ఏంటి అనే విషయం గురించి కూడా అప్పుడే చర్చలు మొదలుపెట్టారు అభిమానులు.

Read More: ఎన్టీఆర్ సినిమాలో నటించిన ఎలాంటి సంతోషం లేదు: ఈషా రెబ్బా

ట్రెండింగ్ వార్తలు