కల్కి 2898 ఏడీ రివ్యూ: సైన్స్ ఫిక్ష‌న్ మూవీతో ప్ర‌భాస్ హిట్ కొట్టాడా?

June 27, 2024

కల్కి 2898 ఏడీ

కల్కి 2898 ఏడీ

  • Cast : ప్రభాస్‌, దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, శోభన, స్వాస్థ ఛటర్జీ, పశుపతి
  • Director : నాగ్‌ అశ్విన్‌
  • Producer : సి.అశ్వనీదత్‌
  • Banner : వైజ‌యంతి మూవీస్‌
  • Music : సంతోష్‌ నారాయణన్‌

3 / 5

Kalki Movie Review and Rating; ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ పూర్తిగా పాన్‌ ఇండియా హీరో అయిపోయారు. ‘మహానటి’తో జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేశారు నాగ్‌ అశ్విన్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అందుకు తగినట్లుగానే పురాణాలను ముడిపెడుతూ ‘కల్కి 2898 ఏడీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మ‌రి ఈ సైన్స్ ఫిక్ష‌న్ మూవీతో ప్ర‌భాస్ హిట్ కొట్టాడా? ఇప్పుడు చూద్దాం.

కురుక్షేత్ర సంగ్రామం అనంత‌రం బ్రహ్మాస్త్ర ప్రయోగంతో ఉత్తర గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తాడు అశ్వత్థామ(అమితాబ్‌). ఈ దుశ్చర్యకు పాల్పడ్డ అశ్వత్థామను ‘మానని గాయాలతో ఇలా చావులేకుండా జీవించు’ అని శపిస్తాడు శ్రీ‌కృష్ణుడు. అశ్వత్థామ శాపవిమోచనం అడగ్గా.. ‘ఉత్తర గర్భంలోని బిడ్డను చంపడానికి ప్రయత్నించి పాపం మూటగట్టుకున్న నువ్వు.. నా వచ్చే అవతారంలో తల్లి గర్భంలో ఉన్న నన్ను కాపాడిన‌ప్పుడే నీకు శాపవిమోచనం జ‌రుగుతుంది’ అని చెప్తాడు.. ఇది జరిగిన ఆరువేల సంవత్సరాల తర్వాత కలి ప్రభావంతో ప్రపంచం దాదాపుగా నిర్వీర్యమైపోతుంది. ఇక భూమిపై మిగిలింది మూడే ప్రాంతాలు. కాశీ, శంబల, కాంప్లెక్స్‌. తిరగబడ్డ పిరమిడ్‌ ఆకృతిలో ఉండే కాంప్లెక్స్‌..భూసారాన్నంతటినీ పీల్చి తనలో నిక్షిప్తం చేసుకుంది. దాంతో సకల సౌకర్యాలు, సంపద కాంప్లెక్స్‌ పరమయ్యాయి. కాంప్లెక్స్‌ ఆధిపత్యంపై శంబల వాసులు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు.

ఎలాగైన మ‌ర‌ణాన్ని జ‌యించాలని ఓ ఫార్ములాని క‌నిపెడ‌తాడు అక్క‌డి సుప్రీమ్ యాస్కిన్‌(కమల్‌హాసన్‌). అయితే అది మ‌హిళ గ‌ర్భంలో క‌నీసం 120 రోజులు ఉండాలి. అయితే 100 దాట‌కుండానే చాలా మంది మ‌హిళ‌లు మ‌ర‌ణిస్తారు. ఎలాగైనా కాంప్లెక్స్‌లో చోటు కోసం ప్రయత్నిస్తున్న‌ వారిలో భైరవ(ప్రభాస్‌) ఒకడు. పరమాత్మ రాకకోసం అశ్వత్థామ కాశీలోని ఓ భూగర్భ దేవాలయంలో ఎదురుచూస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో సుమతి(దీపిక పదుకొనే) అనే అమ్మాయి గర్భం దాలుస్తుంది. అది ఎవ‌రికీ తెలీకుండా 150 రోజులు జాగ్ర‌త్త ప‌డుతుంది. త‌న‌ గర్భంలో ఉన్నది సాక్షాత్‌ శ్రీమన్నారాయణుడి అవతారమైన కల్కి. సుమతి గర్భంలోని శిశువును రక్షించేందుకు అశ్వత్థామ వ‌స్తాడా?భైరవ క్లాంపెక్స్‌కు చేరుకుంటాడా? ఈ క్రమంలో భైరవ నుంచి అశ్వత్థామ‌ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు. మహాభారతం కురుక్షేత్రానికి భైరవకు ఉన్న లింక్‌ ఏమిటి? అనేది మిగిలిన కథ.

కాశీ నుంచి క్లాంపెక్స్‌కు చేరుకోవాలనే భైరవ, తల్లి కావాలనుకునే సుమతి, సుమతి జన్మనివ్వ బోయేది శ్రీకృష్ణుడు అని భావించి, ఈ శిశువును కాపాడాలనుకునే అశ్వత్థామ పాత్రల మధ్యే కథ ప్రధానంగా సాగుతుంది. మహాభారత కురుక్షేత్రంతో కథ మొదలవుతుంది. కానీ ఈ ఎసిపోడ్‌ కొంచెం సేపే ఉంటుంది. మహాభారతంలోని పాత్రలకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కథను కనెక్ట్‌ చేసిన తీరు అద్భుతంగా ఉంటుంది. తొలిభాగం కాశీ,షంబాల, కాంప్లెక్స్‌..నగరాలు..ఈ నగరాల్లోని పాత్రల పరిచయం, భైరవ–బుజ్జిల బాడింగ్, భైరవ–అశ్వత్థామల మధ్య ఓ ఫైటింగ్, క్లాంపెక్స్‌ నుంచి సుమతి బయటపడటంతో తొలిభాగం ముగుస్తుంది. సెకండాఫ్‌ అంతా మేజర్‌గా యాక్షన్‌ సీక్వెన్స్‌లే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కథ ఎక్కువగా ఉండదు. అయితే సుప్రీమ్‌ యాక్సిన్‌ ఎందుకు ఫార్ములాను కనిపెట్టాల్సి వచ్చింది? అంత టెక్నాలజీ ఉన్న క్లాంపెక్స్‌ వాసులు…ఈ చిన్న షంబాల నగరాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారు? సుధీర్ఘమైన జీవితం ఉన్న అశ్వత్థామ…భైరవ అసలు రూపాన్ని ఎందుకు గ్రహించలేకపోయాడు? ఆరువేల సంవత్సరాల టైమ్‌ పీరియడ్‌ ఉన్నప్పుడు కేవలం మహాభారతం కురుక్షేత్రం, 2898ఏడీనే చూపిస్తున్నారు. మధ్యలో ఉన్న ఆరువేల టైమ్‌పీరియడ్‌లో ఏం జరిగింది? అన్న అంశాలకు కూడా బలమైన సన్నివేశాలు ఉంటే బాగుండేది. కల్కి సినిమాటిక్‌ యూనివర్స్‌ అన్నారు కాబట్టి….కల్కి2898 రెండో పార్టులో ఈ సన్నివేశాలు ఉంటాయేమో చూడాలి.

దర్శకుడిగా నాగ్‌ అశ్విన్‌ తన సత్తా ఏంటోమరోసారి చూపించారు. మహాభారత పాత్రలతో సినిమాలోని ప్రధాన పాత్రలను కనెక్ట్‌ చేసిన తీరు ప్రసంశనీయం. కానీ మహాభారతంపై అవగాహన లేని నేటి తరం ఆడియన్స్‌కు ఈ సినిమా ఓ పట్టాన అర్థం కాదు. సి.అశ్వినీదత్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చు స్క్రీన్‌పై కనిపిస్తుంది. సంతోష్‌శ్రీనివాస్‌ సంగీతం బాగుంది. సెకాండఫ్‌లో వచ్చే ఆర్‌ఆర్‌ అదిరిపోతుంది. కెమెరామన్‌గా జోర్డే›్జ స్టోజిల్జోవిచ్‌ పనితనం బాగుంటుంది. మహాభారతంలోని కురుక్షేత్ర ఎపిసోడ్, సెకండాఫ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ విజువల్‌ వండర్‌లా ఉంటాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ ఒకే. ప్రభాస్, దిశాపటానీల మధ్య కొంత ఎడిట్‌ చేసి ఉండొచ్చు. లెంగ్తీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను షార్ప్‌ చేసిన సినిమాకు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు.ఆర్ట్‌ వర్క్‌, ప్రొడక్షన్‌ డిజైనింగ్‌ బాగున్నాయి

ట్రెండింగ్ వార్తలు