Nag Ashwin: ఆల్ టైం ఫేవరెట్ ఫోటోను షేర్ చేసిన నాగ్ అశ్విన్… ఏమంత స్పెషల్?

July 11, 2024

Nag Ashwin: ఆల్ టైం ఫేవరెట్ ఫోటోను షేర్ చేసిన నాగ్ అశ్విన్… ఏమంత స్పెషల్?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. త్వరలోనే ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరనుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మైథాలజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని ప్రాంతాలలోనూ వివిధ భాషలలో కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతూ సంచలనమైన విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా కోసం కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగాను అంటూ తన అరిగిపోయిన చెప్పులను చూపించిన సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే తాజాగా మరోసారి ఒక స్పెషల్ ఫోటోని షేర్ చేస్తూ ఆల్ టైం ఫేవరెట్ ఫోటో అంటూ చెప్పకు వచ్చారు. ఇందులో ఒక మహిళ పాదాలకు పట్టీలు పెడుతూ ఉంది. మరి ఆ మహిళ ఎవరు ఎందుకు ఈ ఫోటో అంత స్పెషల్ అనే విషయానికి వస్తే.. ఈ ఫోటో మరెవరిదో కాదు నటి శోభనది కావటం విశేషం.నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ శోభన లుక్‌ టెస్ట్‌కు సంబంధించిన ఫస్ట్‌ పిక్‌ ఇది అంటూ శోభన పై తనకు ఉన్న అభిమానాన్ని తెలియజేస్తూ ఈ ఫోటో షేర్ చేశారు.

ఇక శోభన దాదాపు 18 సంవత్సరాల తర్వాత తిరిగి వెండి తెరపై సందడి చేశారు. ఇందులో ఈమె శంబాల ప్రజల నాయకురాలు మరియం పాత్రలో నటించారు. ఈ పాత్రలో అసాధారణమైన నటనతో శోభన అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమెకు ఇకపై వరుస సినిమా అవకాశాలు వస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు

ట్రెండింగ్ వార్తలు