December 11, 2021
బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తన ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు. డిఫరెంట్ జోనర్స్‌లో టాప్ డైరెక్టర్స్‌తో సినిమాలు ప్రకటించాడు. ప్రస్తుతం రాధే శ్యామ్ విడుదలకి సిద్దంగా ఉంది. ఆదిపురుష్‌లో ప్రభాస్ పార్ట్ పూర్తయ్యింది. దాంతో శనివవారం నుండి ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఆ సినిమా పూర్తి అయ్యే వరకు ప్రభాస్ షెడ్యూల్ ఉండనుంది. తర్వాత సలార్, స్పిరిట్ సినిమాలను పూర్తిచేయనున్నాడు. వీటితో పాటు బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ యశ్‌రాజ్ ఫిలింస్ లో ఒక స్టెయిట్ బాలీవుడ్ సినిమా చేయనున్నాడని సమాచారం. అయితే తాజాగా డార్లింగ్‌కు సంబంధించిన ఓ వార్త సినీ ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది.
ప్రభాస్ హైదరాబాద్‌లో మరో కొత్త ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముంబైలో ప్రభాస్‌కు విలాసవంతమైన బంగ్లా ఉండగా.. తాజాగా హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ సినీ విలేజ్‌లో రెండెకరాల స్థలంలో పెద్ద విల్లాను నిర్మించనున్నాడని టాక్. ఈ ల్యాండ్ ప్రభాస్ ఎప్పుడో కొనుగోలు చేశాడు కాని కొంత కాలంగా ఆ స్థలం విషయంలో కొన్ని వివాదాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆ వివాదాలు సమసిపోయాయని తెలుస్తోంది. ఆ స్థలం ఖరీదు 120 కోట్లు కాగా అందులో దాదాపు 80కోట్ల రూపాయలతో అత్యాధునిక సౌకర్యాలతో ఒక విల్లాను నిర్మించనున్నాడట. మొత్తంగా కొత్త విల్లా కోసం ప్రభాస్ 200 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు సమాచారం.