February 2, 2022
Prabhas Radheshyam: టాలీవుడ్ లో కొత్త రిలీజ్ డేట్లు.. వెల్లువెత్తుతున్నాయి. ప్రతీ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసేసుకుంటోంది. అయితే…రాధే శ్యామ్ మాత్రం మౌనంగానే ఉంది. దాంతో రాధేశ్యామ్ విడుదల ఎప్పుడు? అనే డౌటు మొదలైంది. మార్చి 11న ఈ సినిమాని విడుదల చేస్తున్నామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దాంతో ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ హ్యాపీ.
అయితే ఇక్కడే రాధేశ్యామ్ సినిమాకి ముందూ వెనక చాలా రిస్కులు పొంచి ఉన్నాయి. మార్చి10న సూర్య నటించిన ఈటీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున రిలీజ్ చేస్తోంది. ఆకాశమే నా హద్దురా, జై భీమ్ సినిమాల సక్సెస్‌తో సూర్య క్రేజ్ మరింత పెరిగింది. ఇది ఈటీ సినిమాకు కలిసొచ్చే అంశమే అయినా ప్రభాస్ అభిమానులను అంతగా రుచించకపోవచ్చు.
ఇక కర్ణాటకలో రాధేశ్యామ్ విడుదలైన తర్వాతి వారం నుండి అంటే మార్చి 17 నుండి 23 వరకూ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్ తప్ప ఏ ఇతర సినిమాలు ప్రదర్శించకూడదు అని పునీత్‌కు నివాళిగా కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్నారు అని వినిపిస్తోంది. ఇదే నిజం అయితే రాధేశ్యామ్ సినిమాకు కర్ణాటకలో భారీ దెబ్బ పడనుంది. ఇవే కాకుండా మార్చి17న అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే రాధేశ్యామ్ హిందీ కలెక్షన్లకు గండికొట్టే ప్రమాదం ఉంది. ఇక మార్చి 25న ఆర్ఆర్ఆర్ రూపంలో మరో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. రెండూ ప్యాన్ ఇండియా సినిమాలే అయినప్పటికీ ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా అన్నింటిలో ఆర్ఆర్ఆర్ దే పైచేయి. ఇలా ఇన్ని రిస్కులని తట్టుకుని ప్రభాస్ రాధేశ్యామ్ నిలబడగలదా అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
దాదాపు 400 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా కాబట్టి మొదటి వారంలోనే వీలైనంత ఎక్కువ కలెక్ట్ చేయాల్సి ఉంది. మరి చూద్దాం ప్రభాస్ స్టామినా అందరి అంఛనాలను తలక్రిందులు చేస్తుందో లేదో?
Read More: ఎఫ్ 3 విషయంలో దిల్‌రాజు రిస్క్ చేయడానికి అసలు కారణం ఇదేనా?