ప్రభాస్‌కు తలనొప్పిగా మారిన రాధేశ్యామ్‌…

December 16, 2021

ప్రభాస్‌కు తలనొప్పిగా మారిన రాధేశ్యామ్‌…

2018..అక్టోబరు 6న..రాధేశ్యామ్‌ సినిమాను స్టార్ట్‌ చేశారు. అప్పట్నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు కావొచ్చు, ఇప్పుడు జరుగుతున్న పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కావొచ్చు ఈ సినిమాకు సంబంధించిన ఎదో ఒక‌ వర్క్స్‌ జరుగుతూ….నే ఉన్నాయి. ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ అంతా పూర్తయిందని చిత్రం యూనిట్‌ అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా కడపలో గండికోట ప్రాంతంల్లో గుడి సెట్‌ వేసి సత్యరాజ్‌ (బాహుబలి ‘కట్టప్ప’) కొన్ని సీన్స్‌ను చిత్రీకరించారు. ఇక్కడితో అయినా ‘రాధేశ్యామ్‌’ పూర్తయిందా అంటే లేదు. ఇటీవలే ‘రాధేశ్యామ్‌’ చిత్రంలో కృష్ణంరాజు పోషిస్తున్న పరమహంస పాత్రకు సంబంధించిన రీషూట్‌ను అన్నపూర్ణ స్టూడియోలో స్టార్ట్‌ చేశారు. ప్రస్తుతం ప్రభాస్, కృష్ణంరాజు కాంబినేషన్‌లో వచ్చే సీన్స్‌ను తీస్తున్నారని తెలిసింది. నిజానికి ఈ సీన్స్‌ను ఎప్పుడో తీయాల్సిందట. కానీ అప్పట్లో కృష్ణంరాజు ఇంట్లో జారిపడ్డారు. దాంతో కుదర్లేదట. ఇక ‘రాధేశ్యామ్‌’ చిత్రం జనవరి 14న విడుదల అయ్యేందుకు రెడీ అవుతుంది. ‘రాధేశ్యామ్‌’ ట్రైలర్‌ను ఈ నెల 23న జరిగే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రిలీజ్‌ చేయనున్నారని తెలిసింది.

ట్రెండింగ్ వార్తలు