January 5, 2022
RadheshyamPostponed: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వల్ల సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు సర్కారువారిపాట, భీమ్లానాయక్, ఎఫ్ 3 రాలేకపోయాయి. తీరా ఆర్ఆర్ఆర్ వాయిదా పడ్డాక..కొన్ని చిత్రాలకు సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అయితే ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రం కూడా వాయిదా పడటంతో(అఫీషియల్ అనౌన్స్మెంట్ మరి కాసెపట్లో రాబోతుంది)ఈ సంక్రాంతికి రానున్న చిన్న సినిమాల సంబరం రెట్టింపు అయ్యింది. దీంతో సంక్రాంతికి వస్తామని చెబుతున్న సినిమాలు నాగార్జున ‘బంగార్రాజు’, రాజశేఖర్ ‘శేఖర్’, రానా 1945, ఆది `అతిధి దేవోభవ`, ఆశిష్‌రెడ్డి ‘రౌడీబాయ్స్’, కల్యాణ్‌దేవ్ ‘సూపర్మచ్చీ’, అశోక్గల్లా ‘హీరో’, వేయిశుభములు కలుగునీకు వంటి చిత్రాలు సంక్రాంతికి విడుదల అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. వీటి మధ్యలోనే అజిత్ వలిమై, విశాల్ సామాన్యుడు, దుల్కర్ ‘సెల్యూట్’ చిత్రాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్దాయి.
AlsoRead: మనస్ఫూర్తిగానే మహేశ్‌బాబు అలా చేశాడా? లేక నిర్మాతల కోసమా!