February 22, 2022
ప్రభాస్ చాలా కాలం తర్వాత చేస్తున్నలవ్ స్టోరీ కావడంతో ‘రాధేశ్యామ్`సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది.
ఇప్పటికే అఖండతో ఆర్ఆర్ స్పెషలిస్ట్‌గా మారిన తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నారు. Radheshyam హిందీ వర్షన్ కు బిగ్ బీ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడిస్తూ.. ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు.
‘రాధేశ్యామ్’ (Radheshyam) వాయిస్ఓవర్ ఇచ్చినందుకు షెహెన్ షా అమితాబ్ బచ్చన్ గారికి ధన్యవాదాలు. ఎపిక్ లవ్ స్టోరీని మీ ఇన్క్రెడిబుల్ నేరేషన్ తో మరింత ఎపిక్ గా మార్చారు అని చిత్ర బృందం పేర్కొంది.
ప్రేమకు విధికి మధ్య జరిగే యుద్ధాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు. 1970ల కాలం నాటి యూరప్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథలో ఫేమస్ హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్ (Prabhas) నటించగా.. ప్రేరణగా పూజా హెగ్డే కనిపించనుంది.
కృష్ణంరాజు – భాగ్యశ్రీ – జగపతిబాబు – ప్రియదర్శి – కునాల్ రాయ్ కపూర్ – సచిన్ ఖేడ్కర్ – మురళి శర్మ – ఎయిర్ టెల్ శాషా ఛత్రి – రిద్ది కుమార్ – సత్యన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
నాలుగు దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చగా.. హిందీ వెర్సన్ కు మిథున్ – మన్హాన్ – అమాల్ మాలిక్ మ్యూజిక్ అందించారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. ఆర్.రవీందర్ ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహించారు. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్.
కరోనా పరిస్థితుల్లో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయింది. 2022 మార్చి 11న తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది
READ MORE: BheemlaNayak: టైటిల్ మార్చండి డైరెక్టర్ సలహా!