నాకు బద్ధకం చాలా ఎక్కువ.. తన వీక్నెస్ బయటపెట్టిన ప్రభాస్!

June 24, 2024

నాకు బద్ధకం చాలా ఎక్కువ.. తన వీక్నెస్ బయటపెట్టిన ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ త్వరలోనే కల్కి ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రభాస్ సైతం పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడటమే కాకుండా ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్ కి సంబంధించి కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ సినిమాలలో చాలా యాక్టివ్ గా అందరితో ఎంతో ప్రేమగా ఉంటూ కనిపిస్తారు. కానీ నిజ జీవితంలో ఆయనకు అందరిలో కలవడం ఏమాత్రం ఇష్టం ఉండదంటూ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన వీక్నెస్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను చాలా బద్ధకస్తుడునని ప్రభాస్ తెలిపారు. ఇంట్లో ఉంటే కనుక నా అంత బద్దకం మరెవరికి ఉండదు అలాగే తనకు చాలా సిగ్గు కూడా ఎక్కువని తెలిపారు. నలుగురు నన్ను చూస్తున్నారు అంటే నేను అక్కడ కంఫర్ట్ గా ఉండలేనని తెలిపారు. ఇక జనాల మధ్యలో కలిసిపోవడం అంటే కూడా నాకు కాస్త ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. ఇక కెమెరా ముందు తాను ఎలా నటించమన్నా నటిస్తాను కానీ కెమెరా వెనుక అయినా సరే కొన్నిసార్లు కొన్ని సన్నివేశాలు నటిస్తున్న సమయంలో అందరి దృష్టి నాపై ఉంది అంటే నటించడానికి కూడా కాస్త ఇబ్బంది పడతాను అంటూ తన వీక్నెస్ లను బయటపెట్టారు.

Read More: పూరి జగన్నాథ్ కు ఆ సినిమాలోని డైలాగ్స్ అంటే అంత ఇష్టమా.. పోకిరి ఇష్టం లేదా?

ట్రెండింగ్ వార్తలు