బేబీ బంప్ తో దీపికా… ప్రభాస్ చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్?

June 20, 2024

బేబీ బంప్ తో దీపికా… ప్రభాస్ చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్?

Kalki 2898 AD Movie Event సినీ నటుడు ప్రభాస్ త్వరలోనే కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ముంబైలో ఈ సినిమా ఈవెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అమితాబ్ కమల్ హాసన్ రానా ప్రభాస్ దీపికా పదుకొనే వంటి సెలెబ్రెటీలు పాల్గొని సందడి చేశారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన దీపిక ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే సంగతి మనకు తెలిసిందే. ప్రెగ్నెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈమె బయట ఎక్కడ పెద్దగా కనిపించలేదు కానీ మొదటిసారి ఈ కార్యక్రమంలో కనిపించడంతో ఈమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలలో దీపిక బేబీ బంప్ తో కనిపించడంతో ఈ వీడియోలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇలాంటి ఒక గొప్ప సినిమాలో భాగం కావడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ ఇచ్చిన ఆతిథ్యం గురించి తెలుపుతూ.. ఆయన పెట్టిన ఫుడ్ కారణంగా ఇలా మారిపోయానని సరదాగా తెలియచేశారు.

ఇక ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత దీపికా స్టేజ్ పైనుంచి దిగుతున్న సమయంలో ప్రభాస్ వెంటనే ఆమె చేతిని పట్టుకొని కిందకు దించారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలా ప్రెగ్నెంట్ అయిన దీపిక పదుకొనేకి ప్రభాస్ ఇలా సహాయం చేయడంతో ప్రభాస్ సో స్వీట్ అంటూ అభిమానులు ఈ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

Read More: బాహుబలి బాటలోనే కల్కి… రెండు భాగాలుగా రానుందా?

ట్రెండింగ్ వార్తలు