ఆ ఒక్క కారణంతోనే కల్కి బడ్జెట్ ఎక్కువైంది.. ప్రభాస్ కామెంట్స్ వైరల్!

May 30, 2024

ఆ ఒక్క కారణంతోనే కల్కి బడ్జెట్ ఎక్కువైంది.. ప్రభాస్ కామెంట్స్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నారు .ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ త్వరలోనే కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి బిగ్ ఈవెంట్ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో బుజ్జి అనే ఒక మిషన్ ని కూడా ప్రభాస్ అందరికీ పరిచయం చేసారు. ప్రస్తుతం బుజ్జి కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాజాగా ఒక ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో ప్రభాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన కల్కి సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కల్కి సినిమాకు డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ పనిచేశారు. ఇక ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం సుమారు 600 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఈ స్థాయిలో డబ్బు ఎందుకు ఖర్చు చేయాల్సి వచ్చిందనే విషయం గురించి ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ మాట్లాడుతూ కల్కి సినిమా గ్లోబల్ రేంజ్ లో ఉండబోతుంది.దేశవ్యాప్తంగా ఉన్న వారితో పాటు అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం రూపొందించాం. అందుకే అంత ఎక్కువ బడ్జెట్‌ అయింది. దేశంలోని గొప్ప నటీనటులను తీసుకున్నాం. నన్ను అందరూ పాన్‌ ఇండియా స్టార్‌ అని పిలుస్తున్నారు. అది నాపై ఎలాంటి ప్రభావం చూపదు. కానీ, నన్ను అలా పిలవడానికి అభిమానులు ఇష్టపడతారు అలా పిలవడం వారిని సంతోషానికి గురిచేస్తుంది అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: సభ్యత లేని మనిషి అంటూ బాలయ్య వ్యవహారంపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు