August 5, 2024
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కృష్ణంరాజు వారసుడిగా అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ప్రభాస్ ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించే ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈయన నటించిన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారు అయితే పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈయనకు ఒక్కో సినిమాకు సుమారు 150 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న సంగతే తెలిసిందే. ఇక కల్కి సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన రెమ్యూనరేషన్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇలా ఒక్కో సినిమాకు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ ఆ డబ్బులు మొత్తం ఏం చేస్తున్నారనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ప్రభాస్ ఎక్కువగా ఫుడ్డు కోసమే ఖర్చు చేస్తారనే సంగతి మనకు తెలిసిందే. అయినా వివిధ రకాల ఫుడ్ తినడమే కాకుండా తన చుట్టూ ఉన్న వారందరికీ కూడా అదే భోజనాలు ప్రత్యేకంగా తయారు చేయించి తినపెడుతూ ఉంటారు. ఇలా ఫుడ్డు కోసమే ఎక్కువ ఖర్చు చేస్తారని దీనితో పాటు ఆయన సంపాదించిన దానిలో రియల్ ఎస్టేట్ పై పెట్టుబడి పెడుతున్నారని తెలుస్తుంది.
ఇప్పటికే హైదరాబాద్లో ఖరీదైన ఫామ్ హౌస్ లు ఉన్నాయి. అలాగే ఇటలీ లండన్ వంటి ప్రాంతాలలో కూడా ఈయన లగ్జరీ హౌస్లను కొనుగోలు చేశారని తెలుస్తుంది. అంతేకాకుండా తన నిర్మాణ సంస్థ కోసం కూడా పెట్టుబడి పెడుతున్నారని తెలుస్తోంది