January 1, 2024
టాలీవుడ్ అండ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) హనుమన్(Hanu Man) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించినటువంటి తేజ సజ్జ హీరోగా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా సంక్రాంతి బరిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.
ఇక ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు సినిమా విడుదల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా సంక్రాంతి పండుగకు విడుదలవుతున్నాయి. ఇలాంటి తరుణంలో మీరు సినిమా విడుదల చేయడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ప్రశాంత్ వర్మ చెప్పినటువంటి సమాధానం వింటే కనుక ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా పరువు మొత్తం తీశారు అన్న భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది.
మేము పండుగ సందర్భంగా సినిమాని విడుదల చేయడానికి కారణం లేకపోలేదు చాలామంది ఒక రొమాన్స్ లేకుండా బూతు పదాలు లేకుండా సిగరెట్ మందు వంటివి తాగకుండా ఉండే సినిమాలను కూడా చూడాలి అని భావిస్తుంటారు. పండగపూట తల్లిదండ్రులతో భార్య పిల్లలతో అక్కచెల్లెళ్లతో కలిసి సినిమాలు చూడాలి అని భావించే వాళ్ళు కూడా ఉంటారు అలాంటివారు ఇలా బూతు రొమాన్స్ ఉండే సినిమాలకు వెళ్లలేరు కదా అలాంటివాళ్లు మా సినిమాకి వస్తారు అందుకే ఈ సినిమాని పండుగ రోజు విడుదల చేయాలని భావించాము అంటూ ప్రశాంత్ వర్మ తెలిపారు.
అయితే ఈయన చెప్పినటువంటి సన్నివేశాలు అన్నీ కూడా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో ఉన్నాయి. దీంతో ఈయన గుంటూరు కారం సినిమాని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కామెంట్స్ చేశారు అంటూ పలువురు భావిస్తున్నారు. ఇలా ప్రశాంత్ వర్మ(Prashanth Varma) తన మాటలతో గుంటూరు కారం సినిమా పరువు మొత్తం తీశారు అంటూ పలువురు భావించగా మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఈయన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.
భూతులు… మందు… సిగరెట్… రొమాన్స్… లేని క్లీన్ సినిమా హనుమాన్ అంటున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ!pic.twitter.com/ag9H30vZ9G
— Movies4u Official (@Movies4u_Officl) December 30, 2023