ఓటీటీలోకి వచ్చేసిన ప్రేమలు మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

April 12, 2024

ఓటీటీలోకి వచ్చేసిన ప్రేమలు మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తమిళ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రేమలు. తమిళ సినిమా అయినా ఈ ప్రేమలు సినిమా మొదట తమిళంలో విడుదల అయ్యి మంచి సక్సెస్ను సాధించడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. అలాగే కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ సినిమాను ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులోకి విడుదల చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల అయ్యి మంచి సక్సెస్ను సాధించింది. యూత్‏ఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

యంగ్ హీరో నెస్లెన్ కె గపూర్, మ్యాథ్యూ థామస్, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ భారీగా వసూళ్లు రాబట్టింది. రొమాంటిక్-కామెడీ చిత్రంగా రూపొందిన ఈ సినిమాను దాదాపు రూ.10 కోట్లతో భావనా స్టూడియోస్ బ్యానర్ పై ఫహద్ ఫాజిల్, దిలీప్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా దాదాపు రూ. 130 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ మూవీ గత అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. శుక్రవారం ఏప్రిల్ 12 నుంచి ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

అలాగే మలయాళం, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే ఆహాలో అందుబాటులో ఉంది. ప్రేమలు చిత్రానికి గిరీష్ ఎడి రచన, దర్శకత్వం వహించారు. శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన్, సంగీత ప్రతాప్ , అల్తాఫ్ సలీం, మీనాక్షి రవీంద్రన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళీ సినిమాగా ప్రేమలు నిలిచింది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ యూవతను ఎక్కువగా ఆకట్టుకుంది. ఈ మూవీలో రీను పాత్రలో నటించిన హీరోయిన్ మమితా బైజు మరింత ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

https://telugu.chitraseema.org/mahesh-babu-chilling-in-europe-with-his-family/

ట్రెండింగ్ వార్తలు