Rajamouli: నేను పెద్దగా ఉత్సాహం చూపించలేదు!

March 13, 2024

Rajamouli: నేను పెద్దగా ఉత్సాహం చూపించలేదు!

మలయాళ సినిమా “ప్రేమలు” ని తెలుగులో కూడా అదే పేరుతో అనువాదం చేశారు. ఈ సినిమాకి రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా మలయాళం లో ఎంత పెద్ద అయిందో తెలుగులో కూడా అంత మంచి హిట్ కొట్టింది. మార్చి 8న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ని హైదరాబాదులో నిర్వహించారు.

ఈ వేడుకకి రాజమౌళి, అనుదీప్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఇక ప్రేమలు హీరో హీరోయిన్లు నస్లేన్, మమిత బైజుతో పాటు మూవీ టీమ్ కూడా సందడి చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ప్రేమలు సినిమాని తెలుగులోకి డబ్బు చేద్దాం అనుకుంటున్నాను అని కార్తికేయ నా దగ్గరికి వచ్చినప్పుడు సరే అన్నాను కానీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. సినిమాకి వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లాను.

అయితే హాల్లో కూర్చున్న తర్వాత మొదటి 15 నిమిషాలు తప్ప సినిమా మొత్తం కడుపుబ్బా నవ్వుతూనే ఉన్నాను. ఈ సినిమాని థియేటర్లలో మాత్రమే చూడాలి. ఫోన్లో చూసి ఎంజాయ్ చేసే సినిమా కాదు ఇది. మలయాళం సినిమాలో డైలాగులు సంగతి నాకు తెలియదు కానీ తెలుగులో మాత్రం డైలాగులు ఇరగదీసారు. ఇక బాధగా, జలసితో చెప్తున్న మాటేమిటంటే మలయాళీ వాళ్ళు చాలా బెటర్ యాక్టర్స్ అని చెప్పాడు.

ఈ సినిమాలో హీరో సచిన్ పాత్రని చూస్తే బయట అలాంటి వాళ్ళు కనిపిస్తే డిప్ప మీద కొట్టాలనిపిస్తుంది అని సరదాగా వ్యాఖ్యానించారు, కానీ సినిమాలో తనకి బాగా నచ్చిన పాత్ర మాత్రం ఆది అని చెప్పారు, భవిష్యత్తులో మమిత కుర్రాళ్ళ క్రష్ అవుతుంది అన్నారు రాజమౌళి. ఇక అనిల్ రావిపూడి మాట్లాడుతూ సినిమా చాలా బాగుందని మలయాళం లో చూసినప్పటికీ తెలుగులో కూడా ఈ సినిమా తప్పకుండా చూడాలని చెప్పారు.

Read More: పింక్ రంగు డ్రెస్సులో పద్ధతిగా అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తున్న రీతూ!

ట్రెండింగ్ వార్తలు