May 8, 2022
భారతదేశపు మొట్టమొదటి సూపర్‌గర్ల్ మూవీగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం `ఇంద్రాని`నుండి నటి గరిమా కౌశల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్..ఈ సందర్భంగా “ఈ చిత్రంలో గరిమా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, ఇంద్రాణి కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందని పేర్కొన్నారు.ఇంద్రాణి ప్రధాన కథాంశం గురించి సంగీత దర్శకుడు సాయికార్తీక్‌గారితో చర్చిస్తున్నప్పుడు, సాయికార్తీక్‌కి కథ బాగా కనెక్ట్ అయ్యిందని దర్శకుడు స్టీఫెన్ పేర్కొన్నాడు. సేవ్ ద గర్ల్ టు సేవ్ ద వరల్డ్(Save the Girl to Save the World) అనే క్యాప్షన్ నచ్చి ఈ శీర్షిక ఆధారంగా ప్రత్యేక టైటిల్ సీక్వెన్స్ పాట కంపోజ్ చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.సైన్స్ ఫిక్షన్ కథాంశం, కామెడీ, అడ్వెంచర్, ఎమోషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, డ్రామా, డ్యాన్స్ నంబర్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లు అన్ని సమపాళ్లలో కూడిన మొట్టమొదటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా ఇంద్రాని నిలుస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది.ప్రస్తుతం ఇంద్రాణి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 27 అక్టోబరు 2022న విడుదల చేయనున్నారు.నటీనటులు: యానియా భరద్వాజ్, కబీర్ దుహన్ సింగ్, షతఫ్ అహ్మద్, గరీమా కౌశల్‌సాంకేతిక వర్గం: బ్యానర్: శ్రే మోషన్ పిక్చర్స్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: స్టీఫెన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: స్టాన్లీ సుమన్ బాబు మ్యూజిక్: సాయి కార్తీక్ డిఓపి: చరణ్ మాధవ నేని ఎడిటర్: ఎస్ బి ఉద్దవ్ యాక్షన్ డైరెక్టర్: ప్రేమ్ సన్ ఆర్ట్ డైరెక్టర్: రవి కుమార్ గుర్రం
https://youtu.be/3LGh1mAc5Jc