June 23, 2022
రెమో సినిమాతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న తమిళ హీరో శివ కార్తికేయన్ ఇటీవల జాతి రత్నాలు సినిమాతో ఘన విజయం సాధించిన అనుదీప్ కేవీ (Anudeep Kv) దర్శకత్వంలో ప్రిన్స్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే ఈ సినిమా విడుదల తేధిని ఎప్పటిలాగే వినూత్నంగా ప్రకటించాడు దర్శకుడు అనుదీప్.
ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో శివకార్తికేయన్, అనుదీప్ సినిమా ఆలస్యానికి సత్యరాజ్‌ను నిందించారు. అయితే సత్యరాజ్ ఎంటరైన తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. తర్వాత హీరోయిన్ మారియా వచ్చి వారితో మాట కలిపింది.
తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషలలో ఈ సంభాషణ జరుగుతుంది. చివరిగా.. ఈ దీపావళికి ‘ప్రిన్స్’ చిత్రాన్ని విడుదల(Prince Movie Releasing on this Diwali) చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్. సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Prince Movie Releasing on this Diwali:Read More: Victor Venkatesh Latest Photos