పవన్ పై అలాంటి కామెంట్స్ చేసిన శ్యామల.. యాంకర్ కు కౌంటర్ ఇచ్చిన నిర్మాత ఎస్ కె ఎన్?

June 4, 2024

పవన్ పై అలాంటి కామెంట్స్ చేసిన శ్యామల.. యాంకర్ కు కౌంటర్ ఇచ్చిన నిర్మాత ఎస్ కె ఎన్?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో యాంకర్ శ్యామల పేరు కూడా ఒకటి. ఎన్నికల ప్రచారం సమయం నుంచి యాంకర్ శ్యామల పేరు సోషల్ మీడియాలో అలాగే ఏపీ పాలిటిక్స్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంది. కాగా యాంకర్ శ్యామల ఏపీ ఎన్నికల ప్రచార సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. వైసీపీ తరుపున ఆమె జోరుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

అయితే శ్యామల సెలెబ్రిటీ కాబట్టి ఆమెని ఉపయోగించుకుని వ్యాఖ్యలు చేయించారో లేక ఆమె స్వయంగా చేసిందో తెలియదు కానీ శ్యామల మాత్రం కాస్త ఘాటుగానే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసింది. అదే విషయం గురించి ఆమెపై పవన్ అభిమానులు దారుణంగా ట్రోల్స్ చేసినప్పటికీ ఆమె ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయి మరి కామెంట్ చేసింది. పవన్ కళ్యాణ్ ఆవేశపడడం, ఆయాస పడడం తప్ప ఇతరులకు సహాయ పడడం తానెప్పుడూ చూడలేదంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది.

దీనితో ఎప్పటిలాగే ట్రోలింగ్ ఎదుర్కొంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం లో సైతం ఓటమి చెందుతారు. వంగా గీత విజయం సాధిస్తుంది అని శ్యామల పడే పదే చెబుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ పై ఇంకా పలు విమర్శలు చేసింది. కానీ నేడు ఏపీలో ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి భారీ విజయాన్ని సాధించింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడం ఖాయం అని ఖరారైపోయింది. దీనితో బేబీ చిత్ర నిర్మాత ఎస్ కె ఎన్ శ్యామలపై సెటైరికల్ గా కౌంటర్ వేసారు. నితిన్ అ..ఆ చిత్రంలోని ఎళ్ళిపోకే శ్యామల, ఏమి బాగాలేదు అంటూ పాటని షేర్ చేసింది. జనసేన పార్టీ నేతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నికల ఫలితాల్లో విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. తమ అధినాయకుడు బంపర్ మెజారిటీతో అసెంబ్లీలోకి ఆడుగుపెడుతుండడంతో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే నిర్మాత యాంకర్ శ్యామలను ఉద్దేశించి కౌంటర్ వేస్తూ ఆ పాట షేర్ చేశాడని పలువురు కామెంట్ చేస్తున్నారు.

Read More: ఇది కదా పవర్ స్టార్ అంటే.. భారీ మెజార్టీతో విజయం సాధించిన జనసేన పవన్ కళ్యాణ్!

ట్రెండింగ్ వార్తలు