మా అబ్బాయి ప్రమోషన్స్ కి రాడు – నిర్మాత ఉషా మూల్పూరి

August 24, 2022

మా అబ్బాయి ప్రమోషన్స్ కి రాడు – నిర్మాత ఉషా మూల్పూరి

నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఉషా మూల్పూరి ప్రకటించారు. ఈ సందర్భంగా విలేఖరు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘కృష్ణ వ్రింద విహారి’ కమర్షియల్ ఎంటర్ టైన‌ర్‌… మంచి ఫ్యామిలీ మూవీ. ఈ కథకి ఒక తల్లిగా కనెక్ట్ అయ్యాను. అలాగే పిల్లల ప్రేమ, మా పెద్దబ్బాయి సాఫ్ట్ వేర్, ఇలా అన్ని ఎలిమెంట్స్ కి కనెక్ట్ అయ్యాం. ఒక పల్లెటూరి కుర్రాడిగా, బ్రాహ్మిన్ కుర్రాడిగా, సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా, కొడుకుగా, ప్రేమికుడిగా, భర్తగా, స్నేహితుడిగా ఇలా భిన్నమైన కోణాల్లో శౌర్యని చూస్తారు. శౌర్య కెరీర్ లో ‘కృష్ణ వ్రింద విహారి’ ఒక బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నాను…అని తెలిపారు

మీ అబ్బాయి కదా అని ఖర్చుకి వెనకాడలేదా అనే ప్ర‌శ్న‌కి స‌మాధాన‌మిస్తూ..మీరు ఇంకో హీరోని, కథని ఇస్తే ఇంతకంటే బాగా తీస్తాం(నవ్వుతూ). మా అబ్బాయి ప్రమోషన్స్ కి రాడు. ఇంకో హీరో అయితే నాకు చాలా పాజిటివ్ గా వుండేదని అనుకుంటాను(నవ్వుతూ). మా అబ్బాయితో తీస్తే చాలా సులువుగా వాళ్ళ అబ్బాయి కదా అనేస్తారు. అదే వేరే హీరో అయితే భలే తీశారని అంటారు. నేను కూడా వేరే హీరోలతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు