June 24, 2024
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారందరూ కూడా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సినిమా చేస్తే హిట్ అందుకున్న వారే. ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను అందించిన పూరి జగన్నాథ్ ఇటీవల కాలంలో తన స్పీడు కాస్త తగ్గించారని చెప్పాలి.
పూరి జగన్నాథ్ ఇటీవల కాలంలో తీస్తున్న సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈయన చివరిగా లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇక పూరి జగన్నాథ్ సినిమాలంటే హీరోలకు భారీ స్థాయిలో ఎలివేషన్స్ ఇవ్వరు ఆయన హీరోలను చాలా విభిన్న రీతిలో చూపిస్తుంటారు. హీరోలకు కాస్త ఆకతాయితనం పొగురు తరహా పాత్రలలో వారిని చూపిస్తూ ఉంటారు. అందుకు మంచి ఉదాహరణగా ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి పోకిరి బిజినెస్ మాన్ సినిమాలను చెప్పొచ్చు.
ఇక మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో డైలాగ్స్ మరో లెవెల్ లో ఉన్నాయని చెప్పాలి. ఇక ఈ సినిమా ఆయన కెరియర్ కు కూడా చాలా మంచి బూస్ట్ ఇచ్చింది. దీంతో ఆయన సినిమాలలో పోకిరి అంటే తనకు చాలా ఇష్టమని అందరూ భావిస్తారు కానీ నిజానికి పోకిరి కంటే బిజినెస్ మాన్ సినిమాలోని డైలాగ్స్ అంటే తనకి ఇష్టమని ఓ సందర్భంలో వెల్లడించినట్టు మహేష్ తెలిపారు. ఇలా పోకిరి కంటే బిజినెస్ మెన్ లో డైలాగులు కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయని చెప్పాలి.
Read More: ప్రభాస్ కల్కి సినిమా అనుకుని రాజశేఖర్ కల్కికి టికెట్ బుక్ చేసుకున్న ఫ్యాన్స్.. హీరో రియాక్షన్ ఇదే?