మరుగునపడిన ప్రాజెక్టు మళ్లీ తెర మీదకి.. ఈసారి తేజ సజ్జతో ప్లాన్ చేసిన పూరి!

May 16, 2024

మరుగునపడిన ప్రాజెక్టు మళ్లీ తెర మీదకి.. ఈసారి తేజ సజ్జతో ప్లాన్ చేసిన పూరి!

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ లైగర్ సినిమా చేస్తున్న సమయంలోనే వాళ్ళిద్దరి కాంబినేషన్లో జనగణమణ సినిమా అనౌన్స్ చేశాడు పూరీ జగన్నాథ్. అయితే లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వటంతో జనగణమన ప్రాజెక్ట్ మూలన పడింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో బిజీ అయిపోయాడు. పూరి జగన్నాథ్ రామ్ పోతినేని తో డబల్ ఇష్మార్ట్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఇలాంటి సమయంలో మళ్లీ జనగణమన ప్రాజెక్ట్ తెరమీదకి వచ్చింది. ఈ సినిమాని యువ కదా నాయకుడు తేజ సజ్జ తో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడంట పూరి. రీసెంట్ గా ఈ హీరో డైరెక్టర్ పూరిని కలిసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తేజ కూడా ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉన్న హీరో. హనుమాన్ రూపంలో వచ్చిన సక్సెస్ ని కాపాడుకునేందుకు బాగానే కష్టపడుతున్నాడు. వచ్చిన ప్రతి ఆఫర్ కి టెంప్ట్ అవ్వకుండా తనకు నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటున్నాడు.

అతను కూడా డిఫరెంట్ కథలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మార్కెట్ పెంచుకోవడం కోసం దర్శక దిగ్గజాలతో పనిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే పూరి జగన్నాథ్ చెప్పిన కథకు తేజ సజ్జ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ ప్రాజెక్టుని విజయ్ దేవరకొండ కన్నా ముందే పవన్ కళ్యాణ్ తోనూ మహేష్ బాబు తోనూ చేయాలని వారికి కధ వినిపించారంట పూరి. వాళ్ళిద్దరూ చర్చల దశలోనే ప్రాజెక్టుని పక్కన పెట్టేశారు.

తర్వాత విజయ్ ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పి కొంతమేర షూటింగ్ కూడా పూర్తి చేశారు. అయితే అనివార్య కారణాల వలన ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసారు. ఆ ప్రాజెక్టు ఇప్పుడు మళ్ళీ తేజ సజ్జతో తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు పూరి జగన్నాథ్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. ప్రస్తుతం మిరాయ్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు తేజ సజ్జ.

Read More: సైకిల్ షాప్ లో పంచర్ వేసుకునేవాడు.. అంత మాట అన్నావ్ ఏంటి బన్నీ?

ట్రెండింగ్ వార్తలు