6 నిమిషాల సీన్ కోసం 60 కోట్లు ఖర్చు చేసిన పుష్ప మేకర్స్.. రిస్క్ చేస్తున్నారా?

April 12, 2024

6 నిమిషాల సీన్ కోసం 60 కోట్లు ఖర్చు చేసిన పుష్ప మేకర్స్.. రిస్క్ చేస్తున్నారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రారంభించారు. ఇక ఈ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నడుమ విడుదలకు సిద్ధమవుతుంది.

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్నటువంటి తరుణంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డారనే విషయాలకు సంబంధించి వార్తలు వైరల్ కాగా ఈ సినిమా కోసం అవుతున్నటువంటి బడ్జెట్ గురించి కూడా ఎన్నో వార్తలు వస్తున్నాయి. అయితే కేవలం ఆరు నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని విషయం ప్రస్తుతం సంచలనంగా మారింది.

పుష్ప సీక్వెల్ సినిమాలో గంగమ్మ జాతరకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అవ్వబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా అమ్మవారి గెటప్ లో కనిపించారు ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇందుకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. అయితే ఈ సన్నివేశాన్ని చేయడం కోసం ఏకంగా 60 కోట్లు ఖర్చు చేశారట.

ఇలా 60 కోట్ల రూపాయలు కేవలం ఆరు నిమిషాల సీక్వెన్స్ కోసం ఖర్చు చేశారు అంటే మామూలు విషయం కాదని చెప్పాలి ఇది కేవలం బన్నీపై సుకుమార్ పై ఉన్నటువంటి నమ్మకంతో చేశారా లేదంటే ఈ ఒక్క సన్నివేశానికి అంత డబ్బు ఖర్చు చేసి రిస్క్ చేస్తున్నారా అన్నది తెలియదు కానీ ఆరు నిమిషాల కోసం 60 కోట్లు అంటే మామూలు విషయం కాదు చిన్న సినిమాలు ఒక మూడు నాలుగు ఈ బడ్జెట్ లోనే చేయొచ్చు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

https://telugu.chitraseema.org/police-resort-to-lathi-charge-on-salman-khan-fans/

ట్రెండింగ్ వార్తలు