అంచనాలు పెంచేసిన పుష్ప 2 సెకండ్ సింగిల్.. వీడియో వైరల్!

May 24, 2024

అంచనాలు పెంచేసిన పుష్ప 2 సెకండ్ సింగిల్.. వీడియో వైరల్!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 మూవీలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 కు టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

ఈ టీజర్ ని చూసిన ఫాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే రష్మిక మందన-అల్లు అర్జున్ మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌‌ను మే 29న ఉదయం 11.07 నిమిషాలకి రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని రష్మికతో ప్రకటిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామీ అంటూ ఈ సాంగ్ మొదలు కాబోతుంది. దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్‌తో మాయ చేసేలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియో ఈ సినిమాపై అంచనాలను కాస్త మరింత పెంచేసింది.

ఇకపోతే సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న పుష్ప 2లో ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది. ఫహాద్ ఫాజిల్‌కి సంబంధించిన సన్నివేశాలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. జూన్ 1న పుష్ప సెట్స్‌లోకి ఫహాద్ రాబోతున్నారు. కంటిన్యూగా రెండు వారాల పాటు ఫహాద్ డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. వీలైనంత త్వరగా ఈ పార్ట్ పూర్తి చేసి షూటింగ్‌కి శుభం కార్డు వేయబోతున్నారు. అయితే స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంది.

Read More: ఓటీటీ లో భారీ రేట్ పలికిన అజిత్ మూవీ.. ద గోట్ మూవీ ని వెనక్కి నెట్టిన గుడ్ బాడ్ అగ్లీ!

ట్రెండింగ్ వార్తలు