పుష్ప..తగ్గాల్సిందే!

December 19, 2021

పుష్ప..తగ్గాల్సిందే!

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల..వైకుంఠపురుములో..’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల కలెక్షన్స్‌ పోటీ గురించి ఇండస్ట్రీలో మంచి టాక్‌ నడించింది. ఇప్పుడు ‘పుష్ప’, ‘వకీల్‌సాబ్‌’ గురించి జరుగుతోంది. పుష్ప విడుదలైన తొలిరోజునే 71 కోట్ల షేర్‌ను కలెక్ట్‌ చేసిందని, ఈ ఏడాదే హాయ్యెస్ట్‌ గ్రాసర్‌ తమదంటే తమదని ఆన్‌లైన్‌లో ఫ్యాన్ష్‌ వార్‌ మొదలైంది. నిజానికి పవన్‌కల్యాణ్‌ వకీల్‌సాబ్‌ తెలుగులో మాత్రమే విడుదలై దాదాపు 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. కానీ పుష్ప ఐదు సినిమాల్లో విడుదలై 71 కోట్లు వసూలు చేసింది.కొన్ని చోట్లు పుష్ప చిత్రం విడుదల కాకపోయి ఉండొచ్చు. కానీ హాయ్యెస్ట్‌ గ్రాసర్‌ మాత్రం వకీల్‌సాబే. ‘పుష్ప’ చిత్రంలో అల్లుఅర్జున్‌ తగ్గేదేలే అనొచ్చు. కానీ 2021 గ్రాసర్‌ విషయంలో మాత్రం అల్లు అర్జున్‌ తగ్గితీరాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు