గూస్ బంప్స్ తెప్పిస్తున్న పుష్ప.. పుష్ప సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తుందిగా?

May 1, 2024

గూస్ బంప్స్ తెప్పిస్తున్న పుష్ప.. పుష్ప సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తుందిగా?

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసినదే .ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పుష్ప.. పుష్ప అనే టైటిల్ సాంగ్ నేడు విడుదల చేశారు.. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సాంగ్ ను వేరే లెవెల్లో కంపోజ్ చేశారు. బన్నీ మాస్ స్వాగ్ ను వేరే లెవెల్ లో చూపించారు. ఈ ఒక్క పాటతో పుష్పరాజ్ రూలింగ్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుందో స్పష్టంగా చూపించారు.

ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ పాటను ట్రెండ్ చేస్తున్నారు. ఈ పాటకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read More: అనసూయ అలాంటి సమస్యతో బాధపడుతున్నారా. అందుకే షేప్ అవుట్ అయ్యారా?

ట్రెండింగ్ వార్తలు