షాకింగ్‌.. పుష్ప విడుదల తేదీ మారింది!

December 16, 2021

షాకింగ్‌.. పుష్ప విడుదల తేదీ మారింది!

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రం రిలీజ్‌ కష్టాల గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకుంటూనే ఉన్నారు. లేటెస్ట్‌ విషయం ఏంటంటే… ‘పుష్ప’ సినిమా సింగపూర్‌లో విడుదల కావడం లేదు. అక్కడి నియమనిబంధనల ప్రకారం రిలీజ్‌కు వారం ముందే సెన్సార్‌ పూర్తి చేసుకోవాలి. కానీ ‘పుష్ప’ విషయంలో ఇది సజావుగా సాగలేదు. దీంతో ‘పుష్ప’ సినిమా విడుదల సింగపూర్‌లో అగిపోయింది. డిసెంబరు 23న ‘పుష్ప’ సినిమాను అక్క‌డ‌ విడుదల అవుతుంది. ఇక మిగిలిన చోట్ల యథావిథిగానే పుష్ప చిత్రం తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ డిసెంబరు 17న అంటే..ఈ శుక్రవారం విడుదల అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు