మళ్ళీ మారేడుమిల్లి అడవులకు పయనమైన పుష్ప‌రాజ్‌!

September 3, 2021

మళ్ళీ మారేడుమిల్లి అడవులకు పయనమైన పుష్ప‌రాజ్‌!

అల్లు అర్జున్ – సుకుమార్ క్రేజీ కాంబినేష‌న్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతోన్న భారీయాక్షన్ డ్రామా ”పుష్ప”. రష్మిక మందన్నా హీరోయిన్. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ పుష్ప‌రాజ్‌కి ప్ర‌తినాయ‌కుడు భన్వర్ సింగ్ షెకావత్ గా క‌నిపించ‌నున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య పోటీ ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ మూవీ రెండు పార్టులుగా విడుద‌ల‌కానుంది. ఫస్ట్ పార్ట్ ‘పుష్ప: ది రైజ్’ పేరుతో క్రిస్మస్ కి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసిన చిత్ర బృందం.. మరో రెండు వారాల్లో టాకీ మొత్తాన్ని కంప్లీట్ చేయనుంది. ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ లో పుష్ప‌రాజ్ – భన్వర్ సింగ్ షెకావత్ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించిన యూనిట్ ఇప్పుడు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తీయాల్సిన యాక్షన్ సీన్స్ కోసం మళ్ళీ మారేడుమిల్లి అడవులకు పయనమయ్యారు. వీరిద్ద‌రి మ‌ధ్య చిత్రీక‌రించే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది. మిగిలిన పాటలను కూడా వీలైనంత త్వరగా షూట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల మీద దృష్టి పెట్టనున్నారు.

ట్రెండింగ్ వార్తలు