అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషనల్‌లో వచ్చిన హ్యాట‍్రిక్ చిత్రం ‘పుష్ప: ది రైజ్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో చిత్ర యూనిట్ థ్యాంక్యూ మీట్‌ను నిర్వహించింది.
దాదాపు మూడు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ మిగతా టీమ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. సాధారణంగా థ్యాంక్స్ మీట్‌లో ఇవన్నీ మాములే..అయితే సినిమా యూనిట్ అంతా మాటల రచయిత శ్రీకాంత్ విస్సా ను మర్చిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
నిజానికి పుష్ప సినిమాలో డైలాగ్స్ బాగా పేలాయి..పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా ఫైర్ అనే డైలాగ్ …ఒక్కో సందర్భంలో ఒక్కో బాడీ లాంగ్వేజ్‌తో పుష్పరాజ్ చెప్పే తగ్గేదే లే డైలాగ్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. దర్శక నిర్మాతలు మర్చిపోయినా అల్లు అర్జున్ విధిగా డైలాగ్ రైటర్‌కి థ్యాంక్స్ చెప్తాడు అనుకున్న వారికి నిరాశ ఎదురైంది. ఎందుకంటే అల్లు అర్ఙున్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మాదిరిగా స్లయిడ్ లు తయారుచేసుకుని, రిమోట్ పాయింటర్ పట్టుకుని వచ్చారు. అదంతా ముందే ప్లాన్ చేస్తే కాని కుదరదు.
ఈ రోజు సుదీర్ఘంగా మాట్లాడతా అంటూనే దాదాపు గంటకు పైగా మాట్లాడారు. వాళ్ల స్లైడ్స్ చూపిస్తూ ప్రతి ఒక్కరి కష్టం గురించి ప్రస్తావించారు. తన సహాయకులను కూడా పరిచయం చేశారు. కాని డైలాగ్ రైటర్ ప్రస్తావనే లేకపోవడంతో కావాలనే డైలాగ్ రైటర్‌ని పుష్ప టీమ్ ప్రక్కన పెట్టింది అనే అనుమానం కలుగుతోంది.