సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్న పుష్ప టైటిల్ సాంగ్..15 దేశాలలో ట్రెండింగ్!

May 3, 2024

సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్న పుష్ప టైటిల్ సాంగ్..15 దేశాలలో ట్రెండింగ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎలాంటి సంచలనాలను అందుకుందో మనకు తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించినటువంటి ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ స్థాయిలో సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా పుష్ప 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఇలా ఈ సినిమా షూటింగ్ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పుష్ప సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

పుష్ప.. పుష్ప.. పుష్ప.. పుష్ప రాజ్ అంటూ సాగిపోయే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ పాట కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా ఏకంగా 15 దేశాలలో ట్రెండ్ అవుతుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ పాటకు ఎలాంటి ఆదరణ లభించిందనే విషయాలన్నింటినీ కూడా మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అన్ని భాషల్లో కలిపి ఈ పాట 24 గంటల్లో ఏకంగా 40 మిలియన్ వ్యూస్ సాధించింది. అంతే కాక 1.27 మిలియన్ లైక్స్ సాధించింది. ఇక ప్రస్తుతం 15 దేశాల్లో పుష్ప సాంగ్ ట్రెండ్ అవుతుంది. ఇలా మొదటి పాటతోనే 15 దేశాలలో ఈ పాట ట్రెండ్ అవుతూ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు సృష్టించడంతో అభిమానులు అలాగే చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

Read More: ధనుష్ లేకుండా కొత్తింట్లోకి అడుగుపెట్టిన ఐశ్వర్య రజనీకాంత్!

ట్రెండింగ్ వార్తలు