March 16, 2024
మనం ఒక థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలి అంటే తప్పనిసరిగా టికెట్ కొని సినిమా చూడాల్సి ఉంటుంది. అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఒక ధర మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక ధర టికెట్ రేట్ లో ఉంటాయి. ఇక ఇప్పటికే పలు సిటీలలో పెద్ద ఎత్తున మల్టీప్లెక్స్ లు నిర్మితమై ఉన్నాయి. వీటిలో పివిఆర్ మాల్ కూడా ఒకటి అని చెప్పాలి. ఇకపై ఈ మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలి అంటే టికెట్ కొనే పని ఉండదని తెలుస్తుంది.
టికెట్ల స్థానంలో పాస్ పోర్ట్ ఉంటే చాలు సినిమాలను ఫ్రీగా చూసే వెసులుబాటును పివిఆర్ అందుబాటులోకి తీసుకురాబోతుంది. ముందుగా ఈ ప్రయోగాన్ని సౌత్ ఇండస్ట్రీలో చేయబోతున్నారని సమాచారం. అసలు ఉచితంగా సినిమాలు చూడటం ఏంటి? అనే విషయానికి వస్తే.. పీవీఆర్ పాస్ పోర్ట్ ల పేరుతో పీవీఆర్ దీన్ని విక్రయిస్తుంది. ఇందులో నెలకు నాలుగు సినిమాలు చూసుకునే అవకాశం కల్పిస్తుంది. ఒక పాస్ పోర్ట్ కొంటే కనుక నెలకు నాలుగు సినిమాలు ఫ్రీగా చూడవచ్చు. ఈ సినిమాలు సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే చూసే అవకాశాలు ఉంటాయి.
వీకెండ్ లో కొత్త సినిమాలు విడుదలవుతాయి ఫుల్ రద్దీగా ఉంటుంది కనుక అప్పుడు చూడాలి అనుకుంటే మాత్రం టికెట్ కొని చూడాల్సి ఉంటుంది. ఇక ఈ పాస్ పోర్ట్ లో కూడా వివిధ రకాలుగా ఉంటాయి. పాస్‌పోర్ట్ 1ప్రకారం.. దీని కాస్ట్ 349 రూపాయలు. ముప్పై రోజుల వరకు వాలిడేషన్ ఉంటుంది. ఈ 30 రోజులలో నాలుగు సినిమాలు చూడవచ్చు అది కూడా సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే. 30 రోజులలో ఈ పాస్ పోర్ట్ వాలిడిటీ పూర్తి అవుతుంది.
పాస్ పోర్ట్ 2 ప్రకారం దీని ధర 1047 రూపాయలు. ఇది 90 రోజుల వరకు పనిచేస్తుంది. 12 సినిమాలు చూసుకోవచ్చు. ఇది కూడా సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే పనిచేస్తుంది. ఇలా ఈ పాస్ పోర్ట్ ప్రకారం మనం 12 సినిమాలను చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇకపై పివిఆర్ లో సినిమా చూడాలి అంటే టికెట్ కు బదులు పాస్ పోర్ట్ ఉంటే చాలు సినిమాలను ఫ్రీగా చూసేయొచ్చు.
Read More: అంజనాదేవికి తన కొడుకులంటే అంత ప్రాణమా?