ప్ర‌భాస్‌, అల్లు అర్జున్‌ని ఆకాశానికి ఎత్తేసిన పీపుల్స్ స్టార్ ఆర్ నారాయ‌ణ మూర్తి

December 28, 2021

ప్ర‌భాస్‌, అల్లు అర్జున్‌ని ఆకాశానికి ఎత్తేసిన పీపుల్స్ స్టార్ ఆర్ నారాయ‌ణ మూర్తి

పీపుల్ స్టార్ ఆర్‌.నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలే ఆయనకు ప్రపంచం. డబ్బుల కోసం కాకుండా సమాజం కోసం మంచి సందేశాత్మక సినిమాలు తీస్తూ దర్శకుడిగా.. నిర్మాతగా.. నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే ఆయనకు అమితమైన ప్రేమ. టాలీవుడ్‌కి చెందిన హీరోలు కానీ, దర్శకులు కానీ మంచి స్థాయిలో రాణిస్తే.. ఆయన మురిసిపోతాడు. బహిరంగంగానే వారిని అభినందిస్తాడు. తాజాగా ప్రభాస్‌, అల్లు అర్జున్‌లపై ఆర్‌ .నారాయణ మూర్తి ప్రశంసల వర్షం కురిపించాడు.

నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టించిన‌ శ్యామ్ సింగ రాయ్ డిసెంబర్‌ 24న విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ యూనిట్‌ హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్‌.నారాయణ మూర్తి.. ప్రభాస్‌, బన్నీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప హీరోలు ప్రభాస్‌, అల్లు అర్జున్‌ అని కొనియాడాడు.

ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. ”మన సౌత్ ఇండియాలో సంక్రాంతి పండగ జరుపుకుంటాం. నార్త్ ఇండియాలో దీపావళి పండగ చేసుకుంటాం. ఈస్టర్న్ స్టేట్స్ లో నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం. ఇవాళ బెంగాల్ లో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఏ బెంగాల్ లో ఈ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయో ఆ ఉత్సవాలను, ఆ గొప్ప తనాన్ని, ఆ కలకత్తా కాళీ నాలుక మహోన్నత బీబత్సాన్ని ఈ సినిమా ద్వారా ప్రపంచానికి చూపింది నవరాత్రి ఉత్సవాలు జరుపుకునేట్టు చేస్తున్నారు. నిర్మాత బోయినపల్లి వెంకట్ గారు ఎంత మంచి వ్యక్తి. నాని గురించి మాట్లాడుతూ ఆయన గురించి నేను ఏమి చెప్పగలంటూ ఆయ‌న ఏడిస్తే.. అయ్యా మీ గ్రాటిట్యూట్, సెంటిమెంట్ కి సెల్యూట్. నిర్మాత అంటే అలా ఉండాలి. అలాగే ఈ చిత్రానికి బ్యాక్ బోన్ గా నిలబడి అమోఘమైన సహాయ సహకారాలు అందించిన దిల్ రాజు గారికి నమస్కారాలు. పాప.. సాయి పల్లవి నిన్ను ఫస్ట్ టైం ఎక్కడ చూశానంటే.. రాజు గారి సినిమా ఫిదాలో చూశా. హీరోయిన్ లా కాకుండా పక్కంటిపిల్లలా ఉండే అమ్మాయి సాయి పల్లవి. ఈ సినిమాలో ఒక హీరో ఒక హీరోయిన్ ని చూస్తాడు. కానీ ఈ సినిమాలో మహంత సాయి పల్లవిని చూడలేదు. నెక్స్ట్ టైం మల్ల వచ్చాడు ఆ మహంత. ఇప్పుడన్నా సాయి పల్లవిని పిలుస్తాడేమో అనుకున్నా. కానీ సాయి పల్లవిని పిలవలే.. డైరెక్టర్ చాలా ట్విస్టులు పెట్టాడు. సాయి పల్లవి చాలా బాగా నటించింది. కృతీ శెట్టి ఎలా ఉంటుందో తెలుసా. భారత దేశాన్ని ఏలిన ఓ గ్రేట్ హీరోయిన్ లాగ ఉంటుంది ఈ పాప. ఆశ పరేఖ్ లా ఉంటుంది కృతి. అంత గొప్ప ఆశ పరేఖ్ కావాలని కోరుకుంటున్న. సత్యదేవ్ మంచి కథ రాశారు. మిత్రులారా ఈ సినిమా ఓ క్లాసిక్. గొప్ప కళా చిత్రాలైన శంకరాభరణం, మేఘ సందేశం లాంటి చిత్రాల తరహాలో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ రాహుల్ గారికి సెల్యూట్ చేస్తున్నా. చాలా సంవత్సరాల తరవాత ఇలాంటి సినిమా చూశా. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరు బాగా పని చేశారు. నాని గారు తెలుగు అమీర్ ఖాన్. సూపర్ యాక్టర్. భారీ క్యారెక్టర్ లో చాలా బాగా చేశారు. ఓ అమీర్ ఖాన్, ఓ ఎన్టీఆర్, ఓ శివాజీ గణేశన్. నాని నటనకు సెల్యూట్. కరోనాను సైతం లెక్కచేయకుండా మంచి సినిమా వస్తే చేయడానికి ప్రేక్షక దేవుళ్ళు రెడీగా ఉన్నారు. ప్రపంచం మొత్తం గర్వించే స్థాయిలో తెలుగు సినిమా ఉంది. ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు..

ఇలాంటి దశలో ఈ శుభ తరుణంలో కొన్నింటిని చూస్తుంటే ఏడుపు వస్తుంది. ఉత్తరాంధ్రలో కొన్ని థియేటర్స్ మూసేస్తున్నారు.. సినిమా అంటే.. సినిమా చూసేవాడు.. సినిమా తీసేవాడు.. సినిమా చూపించేవాడు.. ఈ ముగ్గురూ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఈ సినిమా ఇండస్ట్రీపై కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా బతుకుతున్నారు. ఇలాంటి సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు రాకూడదు. అందుకే నేనొక విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రొడ్యుసర్ కౌన్సిల్ పెద్దల్ని.. ఫిల్మ్ ఛాంబర్ పెద్దల్ని.. మా అసోషియేషన్ పెద్దల్ని.. దిల్ రాజు గారిని.. అల్లు అరవింద్ గారిని.. సురేష్ బాబుగారిని.. చిరంజీవి గారిని.. అందర్నీ విజ్ఞప్తి చేస్తున్నా.. డియర్ థియేటర్స్ ఓనర్స్ మీరు థియేటర్స్ మూసేయొద్దు.. మీకు స్థానికంగా ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలను కలవండి. ఈ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డిగారి దృష్టికి తీసుకుని వెళ్లండి. ప్రభుత్వంపై పాజిటివ్‌గా ఉండండి.. దయచేసి నెగిటివ్‌గా మాట్లాడకండి. ఎమోషన్ అవ్వొద్దు.. ఈ కళామ్మతల్లిని ఆపేయకండి.. సినిమా వాళ్ల ఆవేదన ఏంటో జగన్ మోహన్ రెడ్డిగారూ పాజిటివ్ యాంగిల్‌లో చూడండి. ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరించండి. అన్ని థియేటర్స్ తెరుచుకునేట్టు చేయాల్సిందిగా.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిగారికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రపంచం మొత్తం గర్వించే స్థాయిలో తెలుగు సినిమా ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండాలి.. ఆ దశగా ప్రభుత్వం సరైన నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నా” అన్నారు.

ట్రెండింగ్ వార్తలు